వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెక్కీలకు షాక్: ఐటీ కంపెనీల లాభాలు తగ్గొచ్చు, కారణమిదే!

కఠిన వీసా నిబంధనలు, బ్రెగ్జిట్ ఇతరత్రా సమస్యల్లో చిక్కుక్కొన్న దేశీ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరు అంతంతమాత్రంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కఠిన వీసా నిబంధనలు, బ్రెగ్జిట్ ఇతరత్రా సమస్యల్లో చిక్కుక్కొన్న దేశీ ఐటీ కంపెనీల ఆర్థిక పనితీరు అంతంతమాత్రంగానే ఉండొచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017-18 , క్యూ1) లో ఐటీ సంస్థల మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని దీనివల్ల లాభాలు తగ్గుముఖం పట్టొచ్చని పేర్కొంటున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితులతో సాఫ్ట్‌వేర్ రంగం మందగమనంలో కొనసాగుతోందని నిపుణులు అంచనావేస్తున్నారు. అమెరికాలో చోటుచేసుకొన్న పరిణామాలు కూడ ఇందుకు తోడయ్యాయనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశీయ ఐటి సంస్థలపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా కన్పిస్తోంది.

ట్రంప్ తీసుకొన్న నిర్ణయాలు ఐటీ సంస్థలపై కన్పిస్తోంది. వీసా నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను తెచ్చాడు. అయితే దీని కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలపై తీవ్ర ప్రభావం కన్పిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

2017-18లో ఐటీ సంస్థల లాభాలు తగ్గొచ్చు

2017-18లో ఐటీ సంస్థల లాభాలు తగ్గొచ్చు

2017-18లో ఐటీ సంస్థలపై మార్జిన్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని, దీంతో లాభాలు తగ్గుముఖం పట్టే అవకాశం పట్టొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరుగుదల వేతనాల పెంపు వంటివి కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయని వారంటున్నారు. ఈ నెల 13వ,తేదిన దేశీయ ఐటీ అగ్రగామి టీసీఎస్‌తో ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కానుంది. ఈ నెల 14న, ఇన్పోసిస్, ఈ నెల 20న, విప్రో ఫలితాలను ప్రకటించనున్నాయి.

డీల్స్‌లో పురోగమనం లేదు

డీల్స్‌లో పురోగమనం లేదు

సీజనల్‌గా పటిష్టమైన త్రైమాసికంగా భావించే క్యూ 1లో ప్రధాన ఐటీ కంపెనీల ఆదాయ లాభాల్లో చెప్పుకోదగిన వృద్దికి ఆస్కారం లేదని కోటక్ ఇనిస్టిట్యూట్ ఈక్విటీస్ నివేదికలో పేర్కోంది. ఫైనాన్షియల్ సేవల రంగం నుండి ఆర్డర్ల ధన్ను అనుకొన్నంతగా లేకపోవడం, పెద్ద కాంట్రాక్టులను వేగంగా ముగించలేకపోవడం వంటివి కంపెనీల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

రూపాయి పెరుగుదల కూడ ప్రభావం

రూపాయి పెరుగుదల కూడ ప్రభావం

అదేవిధంగా రూపాయి విలువ పెరుగుదల, వేతనాల పెంపు కూడ మార్జిన్లలో తగ్గుదలకు దారితీసే అంశాలని కోటక్ వివరించింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 3.9శాతం మేర పెరిగింది. ఎడెల్‌వీస్ వెల్లడించింది. అధికవీసా వ్యయాలు, వేతన పెంపు కూడ మార్జిన్ల తగ్గేందుకు కారణమౌతున్నాయి. డాలర్‌తో పోలిస్తే బ్రిటన్ పౌండ్, జపాన్ యెన్, యూరో కరెన్సీలు బలపడుతున్నాయి.

దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం

దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం

మన ఐటీ కంపెనీలపై ఈ క్రాస్ కరెన్సీ సమస్యల కారణంగా మార్జిన్లపై 40-90 బేసిస్ పాయింట్లు 0.4 -0.9 శాతం కోతకు ఆస్కారం ఉంది. క్యూ1లో టాప్-5 ఐటీ సంస్థలైన టీసీఎస్, ఇన్పోసిస్, విప్రో , హెచ్‌సిఎల్, టెక్‌ల డాలర్ ఆదాయల్లో సీక్వెన్షియల్‌గా వృద్ది ఉండొచ్చని ఎడెల్‌వీస్ తెలిపింది.

జోరుతగ్గిన ఫైనాన్షియల్ సేవలు

జోరుతగ్గిన ఫైనాన్షియల్ సేవలు

ప్రధానంగా ఐటీ రంగం ఆదాయాలకు దన్నుగా నిలుస్తోన్న ఫైనాన్షియల్ సేవల రంగంలో తగినంత జోరు లేకపోవడం మన సాఫ్ట్‌వేర్ కంపెనీల బలహీన వృద్దికి కారణమౌతోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అదేవిధ:గా కొత్త డీల్స్‌లో పెద్దగా పెరుగుదల లేకపోవడం కూడ మందగమనానికి కారణంగా చెబుతున్నారు. అమెరికాతోపాటు సింగపూర్, అస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో వీసా నిబంధలను కఠినతరం చేయడంతో భారత ఐటీ రంగం ఇటీవల కాలంలో తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటోంది.

ఐటీ కంపెనీలపై ప్రభావం.

ఐటీ కంపెనీలపై ప్రభావం.

ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో దిగ్గజాలతో సహ అనేక కంపెనీలు భారీగా ఉద్యోగులను కూడ తొలగించేందుకు దారితీస్తోంది. ఏటా జరిపే విధంగా ఏప్రిల్ నుండి వేతనాల పెంపును అమలు చేయడానికి బదులుగా కొన్ని కంపెనీలు దీన్ని వాయిదావేశాయి. మరోపక్క అమెరికా కఠిన వీసా నిబంధనలతోపాటు అక్కడి స్థానికులకు ఉద్యోగాలివ్వాల్సిన పరిస్థితి వచ్చే రెండేళ్ళలో 10 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలిస్తామని ఇన్పోసిస్ ప్రకటించగా, టీసీఎస్, విప్రో కూడ ఇలానే వ్యవహరిస్తున్నాయి.

English summary
Indian information technology firms are expected to report a muted growth in the first quarter hurt by wage hikes, visa fees, stronger rupee and slower pace of large deal closures amid uncertainty surrounding protectionist measures in the United States.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X