వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోట్ల రద్దు: 586 దాడుల్లో రూ.2,900 కోట్లు పట్టివేత

నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా 586 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.2,900 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఆదాయపన్ను శాఖ అధికారులు దేశవ్యాప్తంగా 586 చోట్ల సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో రూ.2,900 కోట్ల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అత్యధికంగా తమిళనాడు నుండి స్వాధీనం చేసుకున్నారు.

మోడీ వద్ద ఏదో ప్రత్యేక వ్యూహం ఉంది: నోట్ల రద్దుపై కేసీఆర్మోడీ వద్ద ఏదో ప్రత్యేక వ్యూహం ఉంది: నోట్ల రద్దుపై కేసీఆర్

దేశంలో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించేందుకు కేంద్రంపెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ ఉన్న వారు తమ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకున్నారు. అయితే, ఐటీ శాఖ దాడులు చేసి, చాలామందికి చెక్ చెప్పింది.

demonetisation

అనుమానాలు ఉన్న ప్రతిచోట దాడులు నిర్వహించింది, నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 586 చోట్ల సోదాలు నిర్వహించి రూ.2,900 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ అధికారులు వెల్లడించారు. 79 కోట్లు విలువగల రూ.2000 నోట్లు ఉన్నాయని, రూ.2,600 కోట్లు లెక్కల్లో లేని నగదు ఉందన్నారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో నిర్వహించిన ఒక్క తనిఖీలోనే రూ.100కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.52 కోట్ల బంగారం సీజ్ చేశారు.

ఢిల్లీలోని ఓ న్యాయవాది ఇంట్లో రూ.14కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆయన అకౌంట్‌ నుంచి రూ.19కోట్లు సీజ్ చేశారు. మహారాష్ట్రలోని పుణె బ్యాంక్‌లో ఒకే వ్యక్తికి సంబంధించిన 15 లాకర్లలో రూ.9.58 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో 8 కోట్ల విలువైన కొత్త రూ.2000 నోట్లు కాగా మిగతావి 100 నోట్లు.

English summary
The tax department has yielded Rs 2900 crore from these searches.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X