కర్నాటక ఎమ్మెల్యే ఇంటిపై ఐటీ దాడి, రూ.120 కోట్ల ఆస్తుల గుర్తింపు
కర్నాటకలో మరో ఎమ్మెల్యే ఇంటి పైన ఆధాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నాడు హోస్‌పేట ఎమ్మెల్యే నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు.
బెంగళూరు: కర్నాటకలో మరో ఎమ్మెల్యే ఇంటి పైన ఆధాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శనివారం నాడు హోస్‌పేట ఎమ్మెల్యే నాగరాజు నివాసంలో సోదాలు నిర్వహించారు.

ఈ సోదాలలో రూ.120 కోట్ల ఆస్తులను అధికారులు గుర్తించారు. పోలీసులు ఆయన నివాసం నుంచి రూ.1.10 కోట్లు, పది కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఐటీ అధికారులు గురువారం నుంచి సదరు ఎమ్మెల్యే నివాసంలో, ఇతర చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే పైన పన్ను ఎగవేత కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఆయన నివాసంలో సోదాలు చేయగా పెద్ద ఎత్తున సొత్త లభ్యమైంది. దాదాపు 3500 డాక్యుమెంట్లు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవి 560 ఎకరాలకు సంబంధించిన కాగితాలు.












Click it and Unblock the Notifications