ఐటీ షాక్: 200 మంది ఉద్యోగులను తొలగించిన సీటీఎస్... కారణం తెలుసా?
సాఫ్ట్‌వేర్ కొలువులకు కాలం చెల్లుతోందా..? ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో బూమ్ పడిపోవడంతో ఆయా కంపెనీలు చాలామంది ఎంప్లాయిస్‌ను తొలగించాయి. మళ్లీ చాలా కాలం తర్వాత మరో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించింది. రోజు రోజుకీ టెక్నాలజీ పెరుగుతుండటంతో ఆ నూతన టెక్నాలజీ వినియోగించే వారికోసం ఆ కంపెనీ ఎదురుచూస్తోందట. ఇందులో భాగంగానే భారీగా ఉద్యోగులను తొలగించింది. ఇంతకీ ఆ కంపెనీ ఏంటనుకుంటున్నారా..?

200 మంది ఉద్యోగస్తులకు గుడ్ బై
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (సీటీఎస్) సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో దిగ్గజ సంస్థ. ప్రస్తుతం ఈ కంపెనీలో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే కంపెనీ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కంపెనీకి సేవలందించిన 200 మంది ఉద్యోగస్తులపై వేటు వేసింది. అంతేకాదు వారికి 3 నుంచి 4 నెలల జీతం కూడా ఇచ్చింది. కొత్త డిజిటల్ టెక్నాలజీ సేవల వినియోగించుకునేందుకు కొత్త రక్తాన్ని కంపెనీ కోరుకుంటోందని వివరించింది. నూతన టెక్నాలజీపై పట్టు సాధించని ఉద్యోగస్తులకు గుడ్‌బై చెప్పి కొత్త నైపుణ్యం ఉన్న వ్యక్తులను నియమించుకునేందుకు సంస్థ రంగం సిద్ధం చేసిందని యాజమాన్యం వెల్లడించింది.

గతేడాది స్వచ్చందంగా 400 మంది తొలగింపు
కంపెనీలో ఎంతమంది ఉద్యోగులను తొలగించాలి, ఎవరెవరు కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోలేకున్నారు అనేదానిపై అన్ని రకాలుగా స్టడీ చేశాకే 200 మంది ఉద్యోగస్తులతో కూడిన జాబితా సిద్ధం చేసింది. ఈ ప్రక్రియ మొత్తం ఆగష్టులోనే ముగిసింది. ఇక వీరికి మొత్తం 35 మిలియన్ డాలర్లు మేరా యాజమాన్యం చెల్లించనుంది. గతేడాది వాలంటరీ సెపరేషన్ స్కీమ్ పేరుతో 400 మంది ఉద్యోగస్తులను పక్కనబెట్టింది సీటీఎస్ కంపెనీ. అయితే ఈ సారి ఏకంగా 200 మందిపై వేటే వేసింది.

కొత్త టెక్నాలజీ పై పట్టున్న వారికి అవకాశం
తమ వ్యాపార లక్ష్యాలతో పాటు క్లైంట్‌కు కావాల్సిన అవసరతలను తీర్చేలా ఉండాలని కంపెనీ భావిస్తున్నందున ... కొత్త టెక్నాలజీపై పట్టున్న ఉద్యోగస్తులు కావాలని ఇందుకోసమే ఉద్యోగుల తొలగింపు చాలా వ్యూహాత్మకంగా చేసినట్లు ఒక ప్రకటనలో తెలపింది. ఇందులో భాగంగానే కొందరి ఉద్యోగులను తొలగిస్తే మరికొందరిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేశామని కంపెనీ వెల్లడించింది. తమ సంస్థలో వినియోగిస్తున్న టెక్నాలజీపై పట్టున్న వారికి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే తొలగింపునకు గురైన ఉద్యోగులకు ఎంత చెల్లిస్తున్నామనేది బహిర్గతం చేయలేమని వెల్లడించింది.

రిలీజ్ డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్న యాజమాన్యం
కంపెనీతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు పరస్పర విడుదల ఒప్పందంపై సంతకాలు చేయాల్సిందిగా కంపెనీ యాజమాన్యం తమను కోరిందని తొలగింపునకు గురైన ఉద్యోగస్తులు చెప్పారు. కంపెనీని వీడిన తర్వాత న్యాయపరంగా కానీ, చట్టపరంగా కానీ కంపెనీ పైన లేదా డైరెక్టర్స్, ఆఫీసర్స్ పైనా ఎలాంటి చర్యలు తీసుకోబోమని తెలుపుతూ రిలీజ్ డాక్యుమెంట్‌పై సంతకాలు తీసుకున్నారని చెప్పారు. అంతేకాదు ఒప్పందం కూడా స్వచ్ఛందంగానే జరిగినట్లు రిలీజ్ డాక్యుమెంట్స్‌లో ఉన్నట్లు వారు వెల్లడించారు. ఈ ఏడాది చివరికల్లా మళ్లీ కంపెనీలో కొత్త టెక్నాలజీపై పట్టున్న ఉద్యోగస్తులు చేరుతారని యాజమాన్యం తెలిపింది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications