IT Hub: అక్కాచెల్లి మీద దాడి కేసులో ముగ్గురి అరెస్టు, దెబ్బకు తేరుకున్న పోలీసులు !
బెంగళూరు: అక్కాచెల్లెలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి వారి బట్టలు చింపేసి చితకబాదిన కేసులో బెంగళూరు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఐటీ హబ్ సమీపంలో కలకలం రేపిన ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ఆనేకల్ తాలుకాలోని సర్జాపుర సమీపంలోని దోమ్మసంద్రలో నివాసం ఉంటున్న సుబ్బారెడ్డికి శాంతిప్రియా, భానుప్రియా అనే కుమార్తెలు ఉన్నారు.
అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. సుబ్బారెడ్డి కుమార్తె శాంతిప్రియా ఆమె పిల్లల చదువు కోసం గత ఏడాది అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రామక్రిష్ణారెడ్డి దగ్గర రూ. 1 లక్ష అప్పు తీసుకుంది. అప్పు తీసుకున్న రూ. లక్ష రూపాయలకు శాంతిప్రియా ప్రతినెల రూ. 9 వేలు వడ్డీ చెల్లించింది.

ఆ సందర్బంలో సునీల్ తో పాటు అతని తల్లిదండ్రులు రామక్రిష్ణారెడ్డి, ఇంద్రమ్మ కలిసి శాంతిప్రియాతో పాటు ఆమె సోదరి భానుప్రియా బట్టలు చింపేసి కర్రలతో దాడి చేశారని శాంతిప్రియా కేసు పెట్టింది. ఐటీ హబ్ ఈ సంఘటన కలకలం రేపింది. మొదట చోద్యం చూసిన పోలీసులు తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో చివరికి రామక్రిష్ణారెడ్డి, సునీల్ తో పాటు మరో వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications