IT HUB: మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య మొబైల్ ఫోన్ మాయం చేసిన కేటుగాళ్లు, పక్కాప్లాన్ !
బెంగళూరు: మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయిన నిందితులు బెంగళూరు పోలీసులకు చిక్కిపోయారు. తండ్రి కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం లోక్ సభలో కీలక పదవిలో ఉన్నారు. కొడుకు ఐటీ శాఖా మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆ నాయకుడు ఐటీ హబ్ లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే భార్య ఇంటి సమీపంలో నడిచి వెలుతున్న సమయంలో నిందితులు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని పరారైనారు. అయితే నిందితులు మొబైల్ ఫోన్ లాక్కెళ్లింది ఎమ్మెల్యే భార్యది అనే విషయం గుర్తించలేకపోయారు. నిందితులు మొబైల్ ఫోన్లు చోరీ చెయ్యడానికి, చైన్ స్నాచింగ్ లు చెయ్యడానికి చోరీ చేసిన బైక్ లు ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

మల్లిఖార్జున్ ఖార్గే కోడలు
కేంద్ర మాజీ మంత్రి, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన (కాంగ్రెస్) మల్లిఖార్జున్ ఖార్గే కొడుకు ప్రియాంక్ ఖార్గే కర్ణాటక మాజీ ఐటీ శాఖా మంత్రి, ప్రస్తుం ప్రియాంక్ ఖార్గే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ప్రియాంక్ ఖార్గే, ఆయన భార్య శృతి ఖార్గే బెంగళూరులోని సదాశివనగర్ లో నివాసం ఉంటున్నారు.

బిగ్ షాట్ ఫ్యామిలీ
ప్రియాంక్ ఖార్గే తండ్రి మల్లిఖార్జున్ ఖార్గే కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుతం లోక్ సభలో కీలక పదవిలో ఉన్నారు. ప్రియాంక్ ఖార్గే ఐటీ శాఖా మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఆ నాయకుడు ఐటీ హబ్ లోని సదాశివనగర్ లో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.

మాజీ మంత్రి భార్య మొబైల్ మాయం
మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖార్గే భార్య శృతి ఖార్గే సదాశివనగర్ లోని ఆమె ఇంటి సమీపంలో నడిచి వెలుతున్న సమయంలో నిందితులు ఆమె మొబైల్ ఫోన్ లాక్కొని పరారైనారు. అయితే నిందితులు మొబైల్ ఫోన్ లాక్కెళ్లింది కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియంక్ ఖార్గే భార్యది అనే విషయం గుర్తించలేకపోయారు. శృతి ఖార్గే కేసు విచారణ చేసిన పోలీసులు జబీ, అస్లాం, మోహిత్, షేక్ అనే నిందితులను అరెస్టు చేశారు. నిందితులు మొబైల్ ఫోన్లు చోరీ చెయ్యడానికి, చైన్ స్నాచింగ్ లు చెయ్యడానికి చోరీ చేసిన బైక్ లు ఉపయోగిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.












Click it and Unblock the Notifications