తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

IT Hub: ఔటర్ రింగ్ రోడ్డు, 20 ఇయర్స్ ఇండస్ట్రీ, 69 డేంజర్ స్పాట్ లు, ఎక్కడెక్కడ అంటే ?, ORR ఎఫెక్ట్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఐటీ హబ్ బెంగళూరు నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డులో అత్యంత ప్రమాదకరమైన డేంజర్ స్పాట్ లు ఉన్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు. 20 ఏళ్ల క్రితం బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డులో 69కు పైగా డేంజర్ యాక్సిడెంట్ జోన్లు గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు ఆ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. మారతహళ్లి- హెబ్బాళ రింగ్ రోడ్డు, బెంగళూరు-బళ్లారి రోడ్డు, హోసూరు రోడ్డులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతం, పాత మద్రాసు రోడ్డు, తుమకూరు రోడ్డులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని బెంగళూరు ట్రాఫిక్ విభాగం లెక్కలు చెబుతున్నాయి.

Girlfriend: వన్ సైడ్ లవ్, యువతి గొంతు చీల్చి, తలను సుత్తితో?, కత్తితో18 చోట్ల కోసిన శాడిస్టు !Girlfriend: వన్ సైడ్ లవ్, యువతి గొంతు చీల్చి, తలను సుత్తితో?, కత్తితో18 చోట్ల కోసిన శాడిస్టు !

20 ఇయర్స్ ఇండస్ట్రీ

20 ఇయర్స్ ఇండస్ట్రీ

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ ఏరకంగా ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. బెంగళూరులో ట్రాఫిక్ రద్దీని నియంత్రించడానికి 20 సంవత్సరాల క్రితం బెంగళూరు చుట్టూ వందల కోట్ల రూపాయల వ్యయంతో 60 కిలోమీటర్ల పొడువుతో ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నిర్మించారు. ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా బెంగళూరులో ట్రాఫిక్ ను కంట్రోల్ చెయ్యాలని అప్పట్లో ప్రభుత్వం అనుకుంది.

69 డేంజర్ స్పాట్ లు

69 డేంజర్ స్పాట్ లు

నిత్యం రద్దీగా ఉండే బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)లో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు. 2019 నుంచి 2021 మద్యకాలంలో ఔటర్ రింగ్ లో 68 డేంజర్ స్పాట్ లు గుర్తించామని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారుల డేటా చూపిస్తోందని ప్రముఖ ఆంగ్ల పత్రిక తెలిపింది.

ఈ రోడ్లు యమ డేంజర్

ఈ రోడ్లు యమ డేంజర్

బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డులోని మారతహళ్లి- హెబ్బాళ రింగ్ రోడ్డు, మాన్యత టెక్ పార్క్, ఇబ్బలూరు జంక్షన్, భాగమనే టెక్ పార్క్, మహదేవపుర, మోర్గాన్, కార్తీక్ నగర్, బాబూసాబ్ పాళ్య, హెణ్ణూరు అండర్ పాస్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో వాహనాలు వేగంగా నడపకుండా ట్రాఫిక్ పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎయిర్ పోర్టు రోడ్డు

ఎయిర్ పోర్టు రోడ్డు

బెంగళూరు-బళ్లారి రోడ్డు మీదుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయనికి ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు సంచరిస్తుంటాయి. బళ్లారి రోడ్డు (హైదరాబాద్ రోడ్డు) లోని జక్కూరు ఫ్లైఓవర్, యలహంక బైపాస్, జాలహళ్లి గేట్ తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని బెంగళూరు ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు.

ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ?

ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ?

ఐటీ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, గార్మెంట్స్ ఫ్యాక్టరీలు, ఫ్యాక్టరీలు ఎక్కువగా ఉండే హోసూరు రోడ్డులో కూడా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు, హోసూరు రోడ్డులోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో ఇప్పటికే వాహనాలు వేగం తగ్గించామని, రోడ్లు విశాలంగా ఉండటం వలన వాహనాలు వేగంగా నడపడం వలన ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని ట్రాపిక్ విభాగం పోలీసులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఆరోడ్లు ఏం తక్కువకాదు !

ఆరోడ్లు ఏం తక్కువకాదు !

ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు సర్జాపుర జంక్షన్, సర్జాపుర రోడ్డు, పాత మద్రాసు రోడ్డు, బెంగళూరు- తిరుపతి రహదారి (కేఆర్ పురం రోడ్డు), తుమకూరు రోడ్డులో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని బెంగళూరు ట్రాఫిక్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద ఔటర్ రింగ్ రోడ్డు కారణంగా ట్రాఫిక్ నియంత్రించాలని అనుకుంటే ఆ ప్రాంతంలో డేంజర్ యాక్సిడెంట్ స్పాట్ లు ఎక్కువ అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
IT Hub: Outer Ring Road is not only the most congested but also the deadliest thoroughfare in Bengaluru,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X