మాఫియా డాన్ దావుద్ ఇబ్రహీం ఆస్తుల విలువ ఎన్ని రూ. లక్షల కోట్ల రూపాయలు అంటే ?
అండర్ వరల్డ్ డాన్, పేరుమోసిన నేరస్థుడు దావూద్ ఇబ్రహీం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా క్రితం భారతదేశాన్ని వదిలి వెళ్లిపోయిన దావుద్ ఇబ్రహీం భారత్, అమెరికా దేశాల వాంటెడ్ క్రిమినల్స్ లిస్టులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు. అయితే దావుద్ ఇబ్రహీం ఈసారి విషం సేవించి ఆస్పత్రి పాలైనట్లు అతని గురి వైరల్ సమాచారం అందింది.
ఈ వార్త అధికారికంగా పాకిస్థాన్ ప్రకటించనప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. ఇటీవల నివేదిక ప్రకారం పేరుమోసిన దావూద్ ఇబ్రహీం మీద విషప్రయోగం జరిగిందని తెలిసింది. అయితే దావుద్ ఇబ్రహీం చనిపోలేదని భారత అధికారులు ధృవీకరించారు. 67 ఏళ్ల దావూద్ ఇబ్రహీంను గ్యాంగ్ స్టర్, క్రైమ్ లార్డ్, డ్రగ్స్ లార్డ్ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. అయితే ఈ క్రైమ్ లార్డ్ దావుద్ ఇబ్రహీం ఇప్పుడు ప్రపంచంలోని టాప్ ఫైవ్ శ్రీమంతుల క్రిమినల్స్ లిస్టులో ఒకడిగా ఉన్నాడు.

దావూద్ ఇబ్రహీం నికర ఆదాయం ఫోర్బ్స్ నివేదిక ప్రకారం 2015 మే నాటికి దాదాపు $ 6.7 బిలియన్ల నికర సంపదను కలిగి ఉన్నట్లు అంచనా వేయబడింది. 2015 మే తర్వాత దావూద్ ఇబ్రహీం ఆదాయ వివరాలు అందుబాటులో లేనప్పటికీ ప్రస్తుతం అతని ఆస్తి 6.7 బిలియన్ డాలర్లు అంటే రూ. 55,741.65 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. దావూద్ ఇబ్రహీం మీద హత్యలు, దోపిడీలు, హత్యాయత్నం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం వంటి ఆరోపణలపై అనేక కేసులు నమోదు అయ్యాయి.
భారత్ తో పాటు అమెరికాకు వాంటెడ్ క్రిమినల్ అయిన దావుద్ ఇబ్రహీం ఐదు ఖండాలలోని 16 దేశాలలో ఆస్తులు సంపాదించాడని వెలుగు చూసింది. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో దావుద్ ఇబ్రహీం భారీగా పెట్టుబడులు పెట్టాడని గతంలోనే వెలుగు చూసింది. అంతకుముందు సెప్టెంబర్ 2017లోయూకే మిర్రర్ నివేదిక ప్రకారం దావూద్ ఇబ్రహీం వార్విక్‌షైర్‌లో ఒక హోటల్ మరియు మిడ్‌లాండ్స్‌లోని ఇతర నివాస ఆస్తులను కలిగి ఉన్నాడన వెలుగు చూసింది.

లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ రోడ్‌లో దావూద్‌కు పెద్ద గ్యారేజీ కూడా ఉన్నట్లు సమాచారం. ఫిబ్రవరి 2018లో పీటీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం దావూద్ ఇబ్రహీం భారీ ఆస్తులు సంపాదించాడని, పోర్ట్‌ఫోలియో మిడ్‌లాండ్స్, ఆగ్నేయ యూకే, భారతదేశం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, స్పెయిన్, ఆస్ట్రేలియా, మొరాకో, టర్కీలలో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాధించాడని వెలుగు చూసింది.
దావుద్ ఇబ్రహీం కుడిభుజం అయిన ముహమ్మద్ ఇక్బాల్ మిర్చి మెమన్ యూకేలో అపారమైన ఆస్తులను కలిగి ఉన్నాడని వెలుగు చూసింది. 2020లో మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆరు ఆస్తులను భారత ప్రభుత్వం విక్రయించింది. భారత ప్రభుత్వం స్మగ్లర్లు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మానిప్యులేటర్స్ (ఆస్తుల జప్తు) చట్టం కింద దావుద్ ఇబ్రహీం ఆస్తులను వేలం వేసింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications