కన్యాకుమారిలో మోదీ కోసం ఎన్ని టన్నుల ఏసీ అంటే ?, స్టార్ హోటల్ సదుపాయాలు !

తమిళనాడులోని కన్యాకుమారిలోని శ్రీ వివేకానంద రాక్ మెమోరియల్ హాల్ ధ్యాన మందిరంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చెయ్యడానికి సర్వం సిద్దం అయ్యింది. సముద్రం మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేసేందుకు ఏసీని అమర్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వివేకానంద రాక్ మెమోరియల్ లో ప్రధాని మోదీ కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో రెండు రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. ఈరోజు తమిళనాడుకు రానున్న మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ లో ధ్యానం చేయనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా కేదార్‌నాథ్ గుహలో ధ్యానం చేశారు. ఎన్నికల ప్రచారం ముగిశాక టీవీ ఛానళ్ల దృష్టి అంతా తనపైనే ఉండాలని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చేయనున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

It is known that two tons of AC was fitted in Kanyakumari for Narendra Modi s meditation

స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యానం చేయనున్నారు. రెండు రోజులు పాటు ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చెయ్యడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు. మోదీ ముందుగా ఢిల్లీ నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారి వెళ్లి సాయంత్రం స్మారక కేంద్రానికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం ప్రారంభిస్తారు. ఈ వివేకానంద ధ్యాన మండపాన్ని మోదీ ఎంపిక చేయడం రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యింది.

ముఖ్యంగా 19వ శతాబ్దపు తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త స్వామి వివేకానంద ఇక్కడ మూడు పగల్లు, మూడు రాత్రులు ధ్యానం చేశారు. చివరి దశ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేసే సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివేకానందుడు ధ్యానం చేసిన చోట ఆయన కూడా ధ్యానం చేయనున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ వేళ వివేకానంద ధ్యానం చేసిన ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోదీ ధ్యానం చెయ్యడం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.

ప్రధాని నరేంద్ర మోదీ సముద్రంలో ధ్యానం చేసేందుకు వీలుగా వివేకానంద మెమోరియల్ హాల్ మెడిటేషన్ రూమ్ లో ఏసీని అమర్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు రెండు టన్నుల ఏసీ (A/C)ని బుధవారం ఉదయం తీసుకొచ్చి ధ్యాన మందిరంలో ఫిట్ చేశారు. వివేకానంద రాక్ మెమోరియల్ ప్రాంతంలో దాదాపుగా త్రీ స్టార్ హోటల్‌కు సమానమైన సౌకర్యాలు అందిస్తున్నారని తమిళ మీడియా అంటోంది. ఇక్కడ ఏసీ సౌకర్యంతోపాటు పలు ఏర్పాట్లతో కూడిన ప్రత్యేక గదిని సిద్ధం చేశారని తెలిసింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం నుండి వివేకానంద రాక్ మెమోరియల్ లో 45 గంటల పాటు ధ్యానాన్ని ప్రారంభించనున్నారు, ఎన్నికల ప్రచారానికి చివరి దశను ఇప్పటికే ముగించారు. ప్రధాని మోదీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి చేశారు. కొన్ని ముఖ్యమైన సమావేశాలు ముగించుకుని మోదీ కేరళ మీదుగా కన్యాకుమారి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా కన్యాకుమారిలో ఎక్కడ చూసినా పోలీసులే దర్శనం ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+