లా పాయింట్ లాగిన సిద్ధరామయ్య: ఇలాగైతే సంకీర్ణ ప్రభుత్వం ఉండదు
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమి ప్రభుత్వం ప్రస్తుతం శాసనసభలో బలపరీక్షను ఎదుర్కొంటోంది. గురువారం ఉదయం ఆరంభమైన ఈ బలపరీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్-జేడీఎస్, ప్రతిపక్ష భారతీయ జనతాపార్టీ సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
బలపరీక్షను అడ్డగించడానికి అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించుకుంటున్నారు. ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, భారీ నీటిపారుదల శాఖ మంత్రి డీకే శివకుమార్ తదితరులు బలపరీక్షలో నెగ్గడానికి పావులు కదుపుతున్నారు.

సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు రానిదే..
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై దాఖలైన పిటీషన్‌కు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు ఇంకా సుప్రీంకోర్టు నుంచి అందాల్సి ఉందని సిద్ధరామయ్య చెప్పారు. సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాకముందే- బలపరీక్షను నిర్వహించడంలో అర్థం లేదని అన్నారు. దీన్ని వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పిటీషన్‌పై వాదోపవాదాలను ఆలకించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బలపరీక్ష నిర్వహణపై ఇప్పటిదాకా ఎలాంటి లిఖితపూరక ఆదేశాలను జారీ చేయలేదని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో బలపరీక్షను నిర్వహించడం సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టే అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేల గైర్హాజరీని పరిగణనలోకి తీసుకుంటే..
కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన పలువురు శాసన సభ్యులు ప్రస్తుతం సభలో లేరని, వారు గైర్హాజరులో ఉన్నారని సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వారి రాజీనామాలను పరిగణనలోకి తీసుకోకూడదని స్పీకర్ రమేష్ కుమార్‌కు సూచించారు. గైర్హాజరీలో ఉన్నప్పటికీ.. వారు తమ పార్టీ ఎమ్మెల్యేలనని అన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. వారిని లెక్కించకపోతే- సంకీర్ణ ప్రభుత్వానికి మనుగడ ఉండదని సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. తిరుగుబాటు ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదని అన్నారు. వారిని లెక్కలోకి తీసుకోకపోతే- సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా నష్టపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications