వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వచ్చ భారత్ అంటే అది.!దేశంలో ఒక్క కరోనా కేసు లేని ఏకైక ప్రాంతం అదే మరి..!

|
Google Oneindia TeluguNews

కవరత్తి/హైదరాబాద్ : కరోనా వైరస్ మహమ్మారి ఎక్కడ, ఎప్పుడు, ఎవరిమీద, ఏరూపంలో ఎందుకు పంజా విసురుతుందో అర్థం కాని పరిస్దితులు నెలకొన్నాయి. ఏమాత్రం కాలూష్యం లేకుండా, స్వచ్చమైన ప్రాణవాయువు అందించే ఆహ్లాదకర వాతావరణం మద్యలో జీవనం కొనసాగిస్తున్న వారిని సైతం కరోనా కాటేస్తోంది. మా గ్రామానికి కరోనా వైరస్ వచ్చే అవకాశాలు లేనే లేవు అన్ని బల్ల గుద్ది చెప్పే వారి గుండెల మీద గుద్ది మరీ ఆ గ్రమాల్లోకి ప్రవేశించింది కరోనా వైరస్.

ద్వీపాల మద్య ఏంజరుగుతోంది..?

ద్వీపాల మద్య ఏంజరుగుతోంది..?

కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేయడం చాలా కష్టంగా పరిణమించింది. తాజాగా కేంద్ర పాలిత ప్రాంతమైన ఆ ప్రదేశంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేశమంతటా కరోనా విలయతాండవం చేస్తోంది. కానీ ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా కరోనా సాహసం చేయడం లేదు. దీంతో ఆ ప్రదేశంలో మాత్రం ఒక్క కరోనా లేదు. భారతదేశంలోని 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకటైన లక్షద్వీప్ లో ఇప్పటవరకు కరోనా కేసు నమోదు కాకపోడం పట్ల యంత్రాంగం విస్మయాన్ని వ్యక్తం చేస్తోంది.

లక్ష్యద్వీప్ లో నమోదు కాని కరోనా కేసు..

లక్ష్యద్వీప్ లో నమోదు కాని కరోనా కేసు..

రానున్న భవిశ్యత్తులో కూడా అక్కడ కరోనా వైరస్ కేసులునమోదయ్యే అవకాశం కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది. ఇది ఎలా సాధ్యమైందనే అంశంపై వైద్య యంత్రాంగం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. లక్ష్మద్వీప్ లో కరోనా వైరస్ ఆనవాళ్లు కూడా చిక్కడం లేదంటే అసలు అక్కడ కరోనా వైరస్ ను నియంత్రిస్తున్న ప్రతికూల పరిస్థితులు ఏంటనే అంశంపై ఆరా తీస్తున్నారు మేధావులు. ఒకవేళ వాతావరణ మార్పులే కరోనా నియంత్రణకు తోడ్పడుతాయనుకుంటే దానికనుగుణంగా తయారు చేసుకునే కార్యాచరణపై శాస్త్రవేత్తలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం..

ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం..

భారత దేశానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్న అరేబియా సముద్రంలో కొన్ని చిన్నచిన్న దీవుల సముదాయాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 36 దీవులుంటాయి. 64 వేల జనాబా ఉంటుంది. ప్రస్తుతం పర్యాటక రంగంపై నిషేధం ఉండటంతో ఎవరూ కొత్త వారు ఆ ప్రదేశాలను సందర్శించడం లేదు. ఇతర ప్రాంతాల్లో పనిచేసే స్థానికులు కూడా టెస్టు చేయించుకుని నెగెటివ్ సర్టిఫికెట్ తో వచ్చేందుకు సుముఖంగా ఉంటేనే వారిని అనుమతిస్తున్నారు. లేకపోతే నిర్ధాక్షిణ్యంగా వెనక్కు పంపిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు అక్కడ 61 మంది అనుమానితులకు మాత్రమే టెస్టులు చేశారు. వారందరికీ నెగెటివ్ వచ్చిందని లక్షద్వీప్ హెల్త్ సెక్రటరీ డాక్టర్ ఎస్.సుందరవడివేలు తెలిపారు.

Recommended Video

Nepal Communist Party లో సంక్షోభం, భారత్ వ్యతిరేక కుట్రలపై ఆగ్రహం
లక్షద్వీప్ అంటే ఏంటి..

లక్షద్వీప్ అంటే ఏంటి..

కవరత్తి అనే పట్టణం ఈ దీవులకు రాజధాని. ఇక్కడ ప్రధానంగా నాలుగు దీవులు సముదాయం ఉంటుంది. కవరత్తి, అగట్టి, మినికోయ్, అమిని. ఈ ప్రాంతానికి గోవా లాగా పర్యట రంగమే ప్రధాన ఆదాయం. బెంగుళూరు, కోచి నుంచి మాత్రమే లక్షద్వీప్ కి విమాన ప్రయాణం ఉంటుంది. కోచి నుంచి పడవల్లో కూడా లక్షద్వీప్ చేరుకునే అవకవం ఉంది. కేరళలోని ఈ కోచి నుంచే వారికి అవసరమైన అన్ని అవసరాలను, మౌళిక సదుపాయాలను ప్రభుత్వం అందిస్తుంది. అధికారిక భాషలు మళయాళం, ఇంగ్లిష్. మన ఉమ్మడి ఆంధప్రదేశ్ ఏర్పడిన నవంబరు 1, 1956 రోజునే ఈ లక్షద్వీప్ ఏర్పడినట్టు తెలుస్తోంది. ఇప్పుడు కరోనా రహితంగా మారిపోవడంతో అందరి దృష్టిని ఆకర్శిస్తోంది ఈ లక్షద్వీప్.

English summary
Officials are investigating whether traces of the corona virus have been found in Lakshadweep or whether there are any adverse conditions controlling the corona virus there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X