వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ జాబ్స్ సంక్షోభం: అమెరికాలో భారతీయులకు వెంటనే ఉద్యోగాలు ఎలా దొరుకుతున్నాయి, ఎవరు సాయం చేస్తున్నారు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఉద్యోగాల కోతలు

అమెరికాలో తాత్కాలిక వీసాలపై పనిచేస్తూ ఇటీవల ఉద్యోగాలను కోల్పోయిన వేలాది మంది భారతీయులకు తమ సహోద్యోగులు అండగా నిలుస్తున్నారు.

మరో ఉద్యోగాన్ని వెదుక్కోవడంలో, అమెరికాలోనే కొనసాగే విషయంలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయులకు అక్కడివారు సహకారం అందిస్తున్నారు.

కాలిఫోర్నియా జర్నలిస్టు సవితా పటేల్ అందించిన కథనం ఇది.

అమిత్ (అభ్యర్థన మేరకు పేరు మార్చాం) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ట్విటర్ ఇటీవల చేపట్టిన ఉద్యోగ కోతల్లో ఆయన ఉద్యోగం కూడా పోయింది.

అయితే, తాను ఇప్పటికే కొన్నిఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఇచ్చానని, "మంచి జాబ్ కోసం రిఫరెన్స్" కూడా అందుకున్నానని ఆయన చెప్పారు.

ఇండస్ట్రీలోని తన తోటివారి సహకారంతోనే ఇది సాధ్యమైందని ఆయన అంటున్నారు.

అమిత్ తరహాలో ఉద్యోగాలు కోల్పోయిన టెక్కీలు కొత్త ఉద్యోగాన్ని సాధించడంలో అక్కడివారు తమ నెట్‌వర్క్‌లను ఉపయోగించి సాయపడుతున్నారు.

''లింక్డిన్‌లో ఉన్న ఇప్పటివరకు నాకు తెలియని హైరింగ్ మేనేజర్లు, ఇంజనీర్లకు నా ప్రొఫైల్ పంపడంతో నాకు కొన్ని ఇంటర్వ్యూ అవకాశాలు వచ్చాయి’’ అని అమిత్ చెప్పారు.

అమెరికాలోని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి. ఇలాంటి వారికి సహాయం చేయడం కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో పుట్టుకొచ్చిన గ్రూపుల ద్వారా ప్రయోజనం పొందుతున్న టెక్ ఉద్యోగులలో అమిత్ కూడా ఉన్నారు.

ఉద్యోగాలు

60 రోజుల్లో జాబ్ రాకుంటే ఇంటికెళ్లడమే...

ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో గత రెండు నెలల్లో మెటా, ట్విటర్, ఆమెజాన్ వంటి సంస్థలు వేలాది మంది సిబ్బందిని తొలగించాయి.

ఈ తొలగింపుల ప్రభావం హెచ్1బీ వీసాలపై పనిచేస్తున్న భారతీయులపై పడింది. హెచ్‌1బీ అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా.

విదేశీయులు ఆరేళ్ల వరకు యూఎస్ కంపెనీల్లో ఉద్యోగాల్లో పనిచేయడానికి ఈ వీసా అనుమతిస్తుంది. ఈ వీసా తీసుకొని అమెరికా వెళ్లి ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారు 60 రోజుల్లోనే మరో ఉద్యోగంలో చేరాలి లేదా అమెరికా నుంచి వచ్చేయాల్సి ఉంటుంది.

భారతీయులు ఎదుర్కొంటున్న ఈ అనిశ్చితిని అర్థం చేసుకున్న అమెరికాలోని సహోద్యోగులు, గడువు లోగా భారత టెక్కీలు మరో ఉద్యోగంలో చేరేలా సహకారం అందిస్తున్నారు.

సహ ఉద్యోగులకు ప్రోత్సాహకరమైన సందేశాలను పంపుతున్నారు, ఉద్యోగ అవకాశాలను పోస్టు చేస్తున్నారు. తమ వ్యక్తిగత నెట్‌వర్క్‌లలో ఉన్న ఇమ్మిగ్రేషన్ లాయర్లను తోటి వారి కోసం ఏర్పాటు చేస్తున్నారు.

ఉద్యోగాల కోత

రూ.2 కోట్ల వరకు వేతనం సాధించే సత్తా ఉన్నా..

ఉద్యోగార్థులను కంపెనీల యజమానులతో కనెక్ట్ చేయడానికి విధి అగర్వాల్, శ్రుతి ఆనంద్‌ కలిసి ఒక డేటాబేస్ రూపొందించారు. వీరిద్దరూ కూడా హెచ్1బీ వీసాపై ఒక టెక్ కంపెనీలో పని చేస్తున్నారు.

''రెజ్యూమ్‌లు పరిశీలిస్తే వారు బాగా చదువుకున్నవారు, మంచి నైపుణ్యాలు ఉన్న టెక్కీలు, రూ. 2 కోట్లు (250,000 డాలర్ల) వేతనం అందుకునేవారని అర్థమైంది.

అందుబాటులో ఉన్న టాలెంట్ నుంచి మా కంపెనీతో పాటు ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను నియమించుకోవచ్చు'' అని సాఫ్ట్‌వేర్ సంస్థ డేటాబ్రిక్స్‌లో పనిచేస్తున్న విధి అగర్వాల్ చెప్పారు.

''రెజ్యూమ్‌లు సరైన వ్యక్తులు చూసేందుకు శ్రుతీ ఆనంద్‌తో కలిసి నేను కృషి చేస్తున్నా. రిఫరల్స్ , ఇంటర్వ్యూ పద్ధతులు తొందరగా పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే హెచ్1బీ వీసా హోల్డర్ల సమయం చాలా తక్కువ ఉంది. ఈ పరిమితి గురించి హైరింగ్ మేనేజర్లు అర్థం చేసుకుంటున్నారు.

కొంతమంది ఇంటర్వ్యూలు వేగంగా జరుగుతున్నాయి. ఒకే నెలలో కంపెనీ ఇంటర్వ్యూ రౌండ్లన్నీ పూర్తవడం సాధ్యపడేది కాదు'' అని ఆమె అన్నారు.

''నన్ను చదివించడానికి నా తల్లిదండ్రులు వారి కలలు త్యాగం చేశారు''

''విధి అగర్వాల్ చేసిన ప్రయత్నాల వల్ల నాకు ఓ మంచి జాబ్ కోసం రిఫరెన్స్ వచ్చింది’’ అని ఆరేళ్ల క్రితం భారత్‌ నుంచి అమెరికాకు వెళ్లిన అమిత్‌ అన్నారు.

అమిత్ భారతదేశంలోని తక్కువ ఆదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. తాను చిన్నప్పటి నుంచి చదువులో చురుకైన వ్యక్తినని, కెరీర్‌లో గొప్ప ఎత్తుకు చేరుకోవాలని కోరుకుంటున్నట్లు అమిత్ చెప్పారు.

''నన్ను అమెరికాలో చదివించడం కోసం మా కుటుంబం భారీగా అప్పు తీసుకుంది. నా కోసం నా కుటుంబ సభ్యులు వాళ్ల కలలు, ఆనందాన్ని త్యాగం చేశారు. నేను వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇప్పుడు నా కుటుంబం పూర్తిగా నాపై ఆధారపడి ఉంది’’ అని అమిత్ తెలిపారు.

ప్రస్తుతం అమిత్ ప్రధానమైన ఆందోళన జాబ్ సాధించడం. తోటి ఉద్యోగుల నుంచి అందుతున్న మద్దతుతో చాలా ధైర్యంగా ఉందని ఆయన చెప్పారు.

కొన్నిచోట్లా ఉద్యోగాలు కోల్పోయిన వారికి సాయం చేయడానికి తోటి ఉద్యోగులు ఈవెంట్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఉత్తర కాలిఫోర్నియాలో 'ఆస్క్ మి ఎనీథింగ్' కార్యక్రమాన్ని ఐఐటీ బే ఏరియా పూర్వ విద్యార్థుల సంఘం నిర్వహించింది. ఇందులో వీసా విధానాలు, ఉద్యోగి హక్కులు, ఇతర సమస్యల గురించి ఉద్యోగులకు అవగాహన కలిగించారు.

అసోసియేషన్ బోర్డు సభ్యుడు, మెటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టీమ్‌లోని సీనియర్ ఉద్యోగి ధర్మేష్ జానీ ఈ ఈవెంట్‌ను నిర్వహించారు.

హెచ్1బీ వీసాలు ఉన్న ఉద్యోగులు వాట్సాప్ గ్రూప్‌లో ఇలాంటి సందేహాలు అడగడంతో ఆయన ఈ ఈవెంట్‌ ఏర్పాటుచేశారు.

ఉద్యోగాల కోతలు

60 రోజుల తర్వాత కూడా జాబ్ రాకపోతే ఏం చేయాలి?

"ఒకరికొకరు సాయం చేసుకునే క్రమంలో ముఖ్యమైన సమాచారం కోల్పోకుండా జాగ్రత్త పడటం ప్రధానమైనది. మాకు సాయం చేయడానికి ఇమ్మిగ్రేషన్ అటార్నీ, హ్యూమన్ రిసోర్స్ ప్రొఫెషనల్‌ వచ్చారు" అని జానీ వివరించారు.

అమెరికాలో తాత్కాలికంగా ఉండటానికి అనుమతించే విజిటర్స్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే, హెచ్1బీ వీసాదారులు మరికొంతకాలం ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వీలు కలుగుతుందంటూ కొన్ని చిట్కాలను ఈ కార్యక్రమంలో చెప్పారు.

సామూహిక తొలగింపుల తర్వాత అందుబాటులోకి వచ్చిన విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి కొన్ని అమెరికా నగరాలు ఆసక్తిగా ఉన్నాయి.

ఉద్యోగార్థులను, కంపెనీలతో అనుసంధానించే ప్లాట్‌ఫారమ్ అయిన జెనోను ప్రారంభించిన బే ఏరియా-ఆధారిత టెక్ నిపుణుడు అభిషేక్ గుట్గుటియా మాట్లాడుతూ.. తన ప్రాజెక్ట్ మిస్సోరీలోని సెయింట్ లూయిస్ నగరంలో ఎక్కువగా ప్రచారంలో ఉందని చెప్పారు.

విదేశీ ప్రతిభను ఆకర్షించడం ద్వారా మెట్రోపాలిటన్ జనాభాను పెంచవచ్చని భావిస్తున్నానని ఆయన తెలిపారు.

కొన్నిపెద్ద టెక్ కంపెనీలు భారీ లే-ఆఫ్‌లను ప్రకటించిన తర్వాత టెక్ ఉద్యోగుల పరిస్థితిని, వారి ఆసక్తిని గమనించి వెంటనే జెనోను ప్రారంభించారు గుట్గుటియా.

తొలిగింపుల తర్వాత ఆర్థిక నిర్వహణ క్లిష్టంగా మారినందున వినియోగదారులకు నగదు ఆదా చేయడంలో సహాయపడటానికి ఇటీవల ప్లాట్‌ఫాంకు కొన్ని కొత్త టూల్స్ అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన చెప్పారు.

వారికి తన ప్లాట్ ఫాంలో ఉన్న జెనో "డూ-ఇట్-యువర్ సెల్ఫ్ ప్లస్ ఎక్స్‌పర్ట్ సపోర్ట్ సిస్టమ్" సాయం చేస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
IT jobs crisis:How come Indians getting jobs immediately after they were fired
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X