ఐటీ దాడులు: జయలలిత వజ్రాలు మాయం, ఎవరి దగ్గర ఉన్నాయి, శశికళ ఫ్యామిలీ టార్గెట్ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యంత్రి జయలలితకు చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకున్న శశికళ కుటుంబ సభ్యుల దగ్గర అమ్మకు చెందిన బంగారు నగలు, వజ్రాలు ఉన్నాయా ? అంటూ ఆరా తీయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారని తెలిసింది.

ఐటీ అధికారులకు షాక్: దినకరన్ ఫాంహౌస్ లో సీక్రెట్ గదులు, లాక్ నెంబర్లు గుర్తులేవు, సీజ్ !

శశికళ కుటుంబ సభ్యుల అక్రమాస్తుల లెక్కలు తేల్చిన తరువాత పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఉన్న జయలలిత వజ్రాలు ఏమైనాయి, శశికళ ఫ్యామిలీలో ఎవరి దగ్గర వజ్రాలు ఉన్నాయి ? అని పూర్తి సమాచారం సేకరించాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం.

 IT officals are targetting to find out the Jayalalithaas Diamonds

జయలలిత ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అధికారికంగా తన దగ్గర వజ్రాలు, బంగారు నగలు ఉన్నాయని ఎన్నికల అధికారుల ముందు దృవీకరించారు. గత ఏడాది డిసెంబర్ 5వ తేదీ జయలలిత మరణించిన తరువాత ఆమెకు చెందిన పోయెస్ గార్డెలోని వేదనిలయం బంగ్లాను శశికళ కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారు.

మోడీ, పళని ప్లాన్: రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ఐటీ దాడులు, జైలు కొత్తకాదు, దినకరన్!

జయలలితకు చెందిన ఆస్తులు మొత్తం శశికళ కుటుంబ సభ్యుల ఆధీనంలోకి వెళ్లిపోయాయి. జయలలిత ఇంటిలో ఉన్న వజ్రాలు, బంగారు నగలు మాయం అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లలో, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపన్ను శాఖ అధికారులు తరువాత జయలలిత ఆభరణాలు, వజ్రాల గురించి ఆరా తీయ్యాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
According to the sources, Income Tax Department officals are targetting to find out the Jayalalithaa's Diamonds from Sasikala family.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి