షాక్: పన్నీర్ సెల్వం పీఏ ఇంటిలో ఐటీ సోదాలు ?
తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కార్యదర్శి (పీఏ) రమేష్ ఇంటిలో బుధవారం ఐటీ సోదాలు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కార్యదర్శి (పీఏ) రమేష్ ఇంటిలో బుధవారం ఐటీ సోదాలు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామ్మోహన్ రావు ఇంటి మీద ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.
ఇదే సమయంలో తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం పీఏ రమేష్ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారని తెలిసింది. తమిళనాడులో ఒకే సారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం పీఏ రమేష్ఇంటిలో ఐటీ సోదాలు చెయ్యడంతో అన్నాడీఎంకే వర్గాలు హడలిపోతున్నాయి.

పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడైన రామ్మోహన్ రావు ఇంటిలో సోదాలు చేసే సమయంలో ముఖ్యమంత్రి పీఏ రమేష్ ఇంటి మీద ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలిసింది. పన్నీర్ సెల్వం ఆర్థిక వ్యవహారాలలో కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు సలహాలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
శేఖర్ రెడ్డి ఇంటి మీద ఐటీ దాడి తరువాత మరన్ని దాడులు జరిగే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావును ఐటీ అధికారులు టార్గెట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు.












Click it and Unblock the Notifications