జయలలిత కొడనాడు ఎస్టేట్ వ్యవహారంలో విచారణ ముమ్మరం, శశికళ గది మీద ఐటీ కన్ను !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. జయలలిత ఎస్టేట్ మేనేజర్లు నటరాజన్, పళనికుమార్ ను విచారణ చేస్తున్నారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారు. జయలలిత ఎస్టేట్ మేనేజర్లు నటరాజన్, పళనికుమార్ ను విచారణ చేస్తున్నారు. శశికళ కుటుంబ సభ్యుల మీద సోదాలు పూర్తి కావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు పలుకోణాల్లో విచారణ చేస్తున్నారు.

అమ్మ జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ కుటుంబ సభ్యులు, సన్నిహితుల విచారణ జరుగుతోంది. ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో భారీగా సోదాలు నిర్వహించారు. ఆదాయపన్ను శాఖ సోదాలు పూర్తయిన నేపథ్యంలో వారిని ఐటీ శాఖ విచారణ చేస్తున్నారు.

IT officials summoned 20 including Kodanad estate manager Natarajan and Palanikumar

నీలగిరి జిల్లాలోని జయలలితకు చెందిన కొడనాడు, గ్రీన్ టీ ఎస్టేట్ లో మాత్రం ఇంకా ఆరు రోజులుగా విచారణ జరుగుతోంది. కోయంబత్తూరులోని ఐటీ కార్యాలయంలో శుక్రవారం విచారణకు హాజరైన కొడనాడు ఎస్టేట్‌ మేనేజర్‌ నటరాజన్‌, గ్రీన్ టీ ఎస్టేట్ మేనేజర్ పళనికుమార్ ను ఐటీ శాఖ అధికారులు విచారించారు.

శశికళ వదిన ఇళవరసి అల్లుడు రాజరాజన్‌ కూడా చెన్నై నుంగంబాక్కంలోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కొడనాడు ఎస్టేట్ లో శశికళ తన గదిలో భారీ మొత్తంలో నగదు, విలువైన ఆస్తుల పత్రాలు దాచి పెట్టారని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+