Google, Facebook: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌‌‌కు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సమన్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2021 మార్గదర్శకాల వ్యవహారం మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ నిషేధానికి కత్తి నూరుతోన్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ గూగుల్, సెర్చ్ ఇంజిన్ గూగుల్‌కు సమన్లను జారీ చేసింది. ఐటీ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సమన్లను ఇచ్చింది. దీని ప్రకారం.. ఈ రెండు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంటుంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొంత తప్పుడు సమాచారాన్ని వైరల్‌గా మార్చిన విషయం మీద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ట్విట్టర్ యాజమాన్యంపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోంది. ఆ సంస్థ పనితీరు పట్ల అసహనంతో ఉంటోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తప్పుడు సమాచారాన్ని నిరోధించడానికి కొత్తగా రూపొందించిన మార్గదర్శకాలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని, దీనికి తమ అంగీకారన్ని తెలియజేయాలంటూ ఇదివరకే ఈ మూడు కంపెనీలకు సూచనలను జారీ చేసింది. ఫేస్‌బుక్, గూగుల్, వాట్సప్ దీనికి అంగీకరించాయి.. ట్విట్టర్ మినహా.

IT Rules 2021 row: Parliamentary Standing committee summons Google, Facebook on June 29

ఇదే విషయంపై తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సైతం ఆయా కంపెనీలకు సమన్లను జారీ చేసింది. మంగళవారం స్టాండింగ్ కమిటీ సమక్షానికి హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. సోషల్ మీడియా, ఆన్‌లైన్‌లో వచ్చే తప్పుడు సమాచారాన్ని, వార్తలను ఎలా నిరోధిస్తారనే విషయంపై సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలంటూ సూచించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టంలో సవరణలను చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) 2021 కింద ఈ ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ఈ సవరణలను చేసింది. కిందటి నెల 26వ తేదీ నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+