వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘criminal attack on the Northeast’ ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ ఫైర్

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల ఉనికి, అస్థిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని నరేంద్ర మోడీ- హోంశాఖ మంత్రి అమిత్ షా నేరపూరిత కుట్రతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చర్యతో ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడ ఉంటోన్న వారు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇది వారి ఆలోచన విధానం, జీవనశైలిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

సంఘీభావం

సంఘీభావం

ఈశాన్య రాష్ట్ర ప్రజల ఆందోళన సరైనదేనని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. వారికి ఆయన సంఘీభావం తెలిపారు. క్యాబ్ పౌరసత్వ సవరణ బిల్లును క్రిమినిల్ అటాక్ ఆన్ ద నార్త్ ఈస్ట్ అని రాహుల్ అభివర్ణించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు.

బలబలాలివే..

బలబలాలివే..

రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 240 కాగా.. బీజేపీకి 83 మంది ఉన్నారు. జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో గట్టెక్కచ్చని భావిస్తోంది. బీజేపీ 83, జేడీయూ, ఎస్ఏడీ మూడు చొప్పున అన్నాడీఎంకే 11, బీజేడీ 7, వైసీపీ ఇద్దరు సభ్యులతో తమ సంఖ్య 128కి చేరుతుందని భావిస్తోంది. దీంతో సులభంగా గట్టెక్కుతామని చెబుతుంది. శివసేనను లెక్కగట్టకున్నా.. జేడీయూ ఎలా వ్యవహరిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

 విపక్ష సభ్యులు 112 మంది

విపక్ష సభ్యులు 112 మంది

ఇక విపక్ష కూటమికి 112 ఓట్లతో బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా వీరికి జతకానుంది. లోక్‌సభ ఓటింగ్‌లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

English summary
congress leader Rahul Gandhi once again attacked the Modi government over the Citizenship (Amendment) Bill -- CAB -- terming it a "criminal attack on the Northeast".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X