వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే పన్నీరు సెల్వం గొప్ప నాయకుడయ్యేవారు: స్వామి సంచలనం

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సీఎం పన్నీరు సెల్వంపై విమర్శలు చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మద్దతు పలికిన భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మరోసారి సీఎం పన్నీరు సెల్వంపై విమర్శలు చేశారు. పన్నీరు సెల్వం ఓ రబ్బరు స్టాంప్ అంటూ ఆరోపణలు చేసిన ఆయన.. శశికళపై సెల్వం చేసిన విమర్శలను తప్పుబట్టారు.

శశికళ ప్రమాణంపై జాప్యమెందుకు?: గవర్నర్‌పై సుబ్రమణ్యస్వామి షాకింగ్ కామెంట్స్ శశికళ ప్రమాణంపై జాప్యమెందుకు?: గవర్నర్‌పై సుబ్రమణ్యస్వామి షాకింగ్ కామెంట్స్

'రాజీనామా చేసిన తర్వాతే శశికళపై ఎందుకు కామెంట్ చేస్తున్నారు? రాజీనామా చేయకుముందే తనను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని చెబితే సెల్వం గొప్ప నాయకుడు అయ్యేవారు' అని ఓ మీడియా ఛానల్‌తో సుబ్రమణ్యస్వామి అన్నారు.

It's a bit late in the day for Panneerselvam to revolt: Subramanian Swamy

అంతేగాక, 'శశకళను ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిగా ఎన్నుకున్నవారిలో సెల్వం లేరా? ' అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడంతా చేయి జారాక ఆయన మాట్లాడటం సరికాదని సుబ్రమణ్య స్వామి అభిప్రాయపడ్డారు.

శశికళకు మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందన గవర్నర్ విద్యాసాగర్ రావు వెంటనే ఆమెతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించాలని కోరారు. ఈ విషయంపై తాను ఇప్పుడే రాష్ట్రపతిని కలిశానని, తమిళనాడు రాజకీయ పరిణామాలు వివరించానని చెప్పారు. రాష్ట్ర గవర్నర్ బాధ్యతల విషయంపై కూడా రాష్ట్రపతితో చర్చించినట్లు తెలిపారు.

English summary
BJP MP Subramanian Swamy told India Today on Wednesday that it's a bit late in the day for outgoing Tamil Nadu Chief Minister O Panneerselvam to revolt against the AIADMK's chief-minister-designate VK Sasikala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X