నాలుగేళ్ళు జైల్లో నరకం అనుభవించాం: తల్వార్ దంపతులు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: నాలుగేళ్ళపాటు జైల్లో నరకాన్ని అనుభవించినట్టు ఆరుషీ తల్లిదండ్రులు ప్రకటించారు. ఆరుషీతో పాటు పనిమనిషి హేమరాజ్‌ను హత్య చేశారంటూ నాలుగేళ్ళపాటు జైల్లో ఉన్న ఆరుషీ తల్లిదండ్రులు ఎట్టకేలకు నోరు విప్పారు. ఓ ఛానెల్‌కు వారు ఇంటర్వ్యూ ఇచ్చారు.

  Aarushi Talwar Case : ఆరుషి హత్య కేసు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు | Oneindia Telugu

  తల్వార్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యాక అజ్ఞాతవాసంలోకి వెళ్ళారు. కూతురిని కోల్పోయిన నాటి నుంచి విడుదలయ్యే సమయం దాకా ఏనాడూ వాళ్లు మీడియా ముందు నోరు విప్పలేదు.

  It’s scary to go back into world: Talwars after acquittal in Aarushi murder case

  ''దస్న జైల్లో ఉన్న నాలుగేళ్లు నరకం అనుభవించాం. ప్రతీరోజూ ఏడుస్తూనే ఉన్నాం. అక్కడనుంత సేపు ఎంతో భావోద్వేగంగా గడిపాం. పక్క సెల్‌లో ఉన్న ఓ అమ్మాయిలో మా కూతురి(ఆరుషి)ని చూసుకుంటూ గడిపినట్టు చెప్పారు.

  ఎట్టకేలకు విడుదలతో కాస్త ఉపశమనం దొరికినట్లయ్యింది. కానీ, బయటికొచ్చాక ఎలా? అది ఇంకా భయంకరమైన పరిస్థితి. లోకం మా గురించి ఏమనుకుంటుందో అంటూ క్షణక్షణం మనోవేదనతో గడపాలి. నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు మాకీ పరిస్థితి తప్పదన్నారు."

  అయితే పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మారుతుందని చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత కొందరు తమపై సానుభూతి చూపించటం మొదలుపెట్టారని రాజేశ్ తల్వార్‌ చెప్పారు. కూతురిని కోల్పోయామని, ఇక మిగిలిన జీవితం ఆమె జ్ఞాపకాలతోనే బతుకుతామన్నారు. కూతురి పేరిట సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని నుపుర్ తల్వార్‌ తెలిపారు. అసలు హంతకులు ఎవరు అన్న ప్రశ్నకు సమాధానానికి.. ఆ విషయం భగవంతుడే తేల్చాలని చెప్పారు.

  ఇక హేమరాజ్‌ మరణంపై ఆ సమయంలో స్పందించే ఆస్కారం లేకుండా పోయిందన్న తల్వార్ దంపతులు.. అతని కుటుంబానికి అభ్యంతరం లేకపోతే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  “We were crying, both of us were crying. It was a very emotional moment... it was a big sense of relief.” This was how Rajesh Talwar, father of Aarushi Talwar, described his feelings after his release from jail.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి