‘అర్ధరూపాయి లేఖ: నన్ను, మోడీని ఏం చేయలేవు’

ఢిల్లీ/ పనాజీ: ఉగ్రవాద సంస్థ ఐఎస్ బెదిరింపు లేఖపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీకి, తనకు ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న ప్రచారాన్ని పారికర్‌ తోసిపుచ్చారు.

మోడీ, పారికర్‌లను హతమారుస్తామంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు రాసినట్లుగా ఒక పోస్టుకార్డు గతవారం గోవా సచివాలయానికి చేరడం గురించి గురువారం మీడియా ప్రశ్నించినప్పుడు ఆయన ఈ మేరకు స్పందించారు.

'It was on a 50 paise postcard': Parrikar dismisses IS letter threatening him, PM Modi

అర్థరూపాయి పోస్టుకార్డుపై ఆ బెదిరింపు వచ్చిందంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. కాగా, ఆ బెదిరింపు లేఖను గోవాలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించిన ఉగ్రవాద వ్యతిరేక పోలీస్ దళం ఘటనపై దర్యాప్తు చేస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ దావోస్‌కు వెళ్లరు

డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనబోరని విదేశాంగశాఖ అధికారప్రతినిధి వికాస్‌ స్వరూప్‌ వెల్లడించారు. పఠాన్‌కోట్‌ దాడి నేపథ్యంలో నవాజ్‌షరీఫ్‌తో భేటీకి అవకాశం లేకుండా దావోస్‌ పర్యటనను మోడీ రద్దు చేసుకున్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ప్రధాని అక్కడికి వెళ్లే కార్యక్రమమే లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+