జియోకు షాక్: 6 నెలలపాటు ఐడియా ఉచిత డేటా

Posted By:
Subscribe to Oneindia Telugu

ఇతర టెలికం కంపెనీల మాదిరిగానే ఐడియా కూడ ఉచిత ఆఫర్లకు సిద్దమైంది. రిలయన్స్ జియో ఉచిత డేటా, వాయిస్ కాల్స్ తో ముందుకు రావడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఇదే బాటలో పయనిస్తున్నాయి.ఆరు మాసాల పాటు ఉచిత డేటాను ఇచ్చేందుకు ఐడియా కూడ సిద్దమైంది.

ఏప్రిల్ నుండి రియలన్స్ జియో కస్టమర్లు కూడ డబ్బులు చెల్లించాల్సిందే.అయితే రిలయన్స్ నుండి తమ వైపుకు కస్టమర్లను ఆకర్షించేందుకుగాను ఐడియా, ఎయిర్ టెల్ లాంటి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ఉచిత ఆఫర్లతో రావడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఉచిత ఆఫర్లను ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చిపడ్డాయి.

రిలయన్స్ తరహలోనే ఐడియా, ఎయిర్ టెల్ లు కూడ ఉచిత ఆఫర్లను ముందుకు తెస్తున్నాయి.అయితే తాజాగా ఐడియా కూడ ఉచిత డేటా ఆఫర్ ను ముందకు తెచ్చింది.

 ఆరు నెలల పాటు ఐడియా ఉచిత డేటా

ఆరు నెలల పాటు ఐడియా ఉచిత డేటా


రిలయన్స్ ప్రవేశపెట్టిన ఉచిత ఆఫర్లను అనివార్యాంగా ఇతర కంపెనీలు కూడ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇప్పటికే ఎయిర్ టెల్ తన పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు మూడు మాసాల పాటు ఉచిత డేటా ఆఫర్ ను ప్రకటించింది.తాజాగా ఐడియా కూడ ఆరుమాసాల పాటు తన కస్టమర్లకు ఉచిత డేటా ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.బుదవారం నుండి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది.

ఉచిత డేటా ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లకే

ఉచిత డేటా ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లకే


ఆదిత్య బిర్లా గ్రూప్ మొబైల్ టెలికం సేవల సంస్థ మోడల్స్ లో మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తోంది. దేశ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో వినియోగదారులకు దీని మూలంగా లాభం చేకూరునుందనే విశ్వాసాన్ని ఐటెల్ సీఈఓ సుధీర్ కుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఉచిత డేటా ఆఫర్ ను ఇలా పొందే అవకాశం

ఉచిత డేటా ఆఫర్ ను ఇలా పొందే అవకాశం


ఐటెల్ స్మార్ట్ పోన్ లోని ఐడియా ద్వారా http://i4all.ideacelluar.com/offers సైట్ ను సందర్శించాలని కోరింది. అనంతరం గెట్ స్టార్టెడ్ బటన్ నొక్కితే యూజర్ డివైజ్ ఐఎంఈఐ, ఫోన్ నెంబర్ వెబ్ సైట్ గుర్తిస్తోంది.ఈ ప్రక్రియ విజయవంతం కావాలని ముగిసిన తర్వాత కన్మర్ మేషన్ మేసేజ్ వస్తోందని కంపెనీ ప్రకటించింది. ఈ మేసేజ్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చని ఐడియా ప్రకటించింది.

ఆరు మాసాలు పాటు ఉచిత డేటా ఇలా

ఆరు మాసాలు పాటు ఉచిత డేటా ఇలా

ఈ ప్లాన్ ద్వారా తొలి మాసంలో డేటా పూర్తిగా ఉచితంగా పొందే అవకాశం ఉంది. అయితే ఆరుమాసాల తర్వాత వరుసగా 1 జీబీ డేటా ఉచితంగా పొందే అవకాశం ఉంది. నెలకు రూ.50 లేదా అంతకు మించి ప్యాక్ లు చెల్లించడం ద్వారా అదనపు డేటా లేదా వాయిస్ కాల్స్ ను పొందవచ్చని తెలిపింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Leading mobile brand from Transsion Holdings Conglomerate itel has partnered with Idea Cellular, one of the leading Indian mobile operators, to offer free one GB of Data per month for up to six months on specific models of itel smartphones.
Please Wait while comments are loading...