విష్ణువు 11వ అవతారం జయలలిత..: అన్నాడీఎంకె ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత అంటే ఆ పార్టీ నేతలకు ఎంతటి అభిమానమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యక్తిపూజకు కేరాఫ్‌గా కనిపించే తమిళ పాలిటిక్స్.. కొన్ని విషయాల్లో పరాకాష్టను తలపిస్తాయి. తాజాగా అన్నాడీఎంకె పార్టీ ఎమ్మెల్యే ఒకరు జయలలితను విష్ణువు 11వ అవతారంగా అభివర్ణించారు.

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. గురువారం నాటి సభలో మరియప్పన్ కెన్నడీ అనే ఎమ్మెల్యే ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో జయలలిత గురించి పదేపదే ప్రస్తావిస్తూ.. ఆమెను విష్ణువు అవతారంగా పోల్చారు. అంతేకాదు, ప్రస్తుతం ఆ స్థానంలో శశికళ ఉన్నారని, అలాగే దినకరన్ కూడా తమకు వెలుగుచూపించే వ్యక్తి లాంటి వాడని మరియప్పన్ అభిప్రాయపడ్డారు.

J Jayalalithaa 11th 'avatar' of Lord Vishnu, says AIADMK MLA Mariappan Kennedy

అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాల్సిందిగా డిమాండ్ చేశాయి.
అన్నాడీఎంకె ఎన్నికల గుర్తు 'రెండాకుల' కోసం పన్నీర్, పళనిస్వామి వర్గాలు ఎన్నికల సంఘానికి అఫిడవిట్లు దాఖలు చేసిన మరుసటిరోజే మరియప్పన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At a time when Tamil Nadu's ruling AIADMK is witnessing a bitter struggle for power between the O Panneerselvam and Edappadi Palaniswami-led camps, one of its MLAs on Thursday said that the late former general secretary of the party, J Jayalalithaa, was actually an incarnation of Lord Vishnu.
Please Wait while comments are loading...