• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సీఎంగా ఉంటూ మృతి: జయ 3వ ముఖ్యమంత్రి, దటీజ్ అమ్మ

|

చెన్నై: ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయిన మూడో వ్యక్తి జయలలిత. జయ డిసెంబర్ 5, 2016 రాత్రి గం.11.30 నిమిషాలకు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రిగా కన్నుమూశారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులుగానే కన్నుమూశారు. జయ మూడో సీఎం.

అర్ధరాత్రి సీఎంగా పన్నీరు సెల్వం ప్రమాణం: చాయ్‌వాలా నుంచి.. ఇదీ ప్రస్థానం

అన్నాదురై కూడా ముఖ్యమంత్రిగా కన్నుమూశారు. ఇతను తొలి ద్రవిడ పార్టీ నేత. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే 1969 ఫిబ్రవరి 3వ తేదీన మృతి చెందారు.

ఆ తర్వాత అన్నాడీఎంకే నేత ఎంజీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా కన్నుమూశారు. ఆయనను ఎంజీఆర్ అని పిలుస్తారు. ఈయన జయలలితకు గైడ్. ఇతని కిడ్నీ ఫెయిల్ అయింది. అతనికి స్ట్రోక్ వచ్చింది. అతనిని అత్యుత్తమ చికిత్స కోసం అమెరికాకు తరలించారు. అతను పూర్తిగా కోలుకోలేదు. 24 డిసెంబర్ 1987లో కన్నుమూశారు. అప్పటికి అతను సీఎంగా ఉన్నరు. అతని మృతి కూడా వయోలెన్స్‌కు దారి తీసింది.

Jayalalithaa

జయ అంటేనే ఓ సంచలనం

అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు జయలలిత అమ్మ. ప్రతిపక్షాలకు, రాజకీయ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్య. అనుగ్రహిస్తే ఎవరినయినా అందలమెక్కిస్తుంది. ఆగ్రహిస్తే వెంటాడుతుంది. రాజకీయంగా ఆమెను అంతం చేయాలని ఎంతోమంది ప్రయత్నించినా.. రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లారు.

శక్తిమంతమైన నాయకురాలు: మోడీ దిగ్భ్రాంతి, రేపు చెన్నైకి చంద్రబాబు

కేవలం ద్రవిడ రాజకీయాలే కాదు యావత్‌ భారతదేశ రాజకీయాల్లో ఆమె సంచలనం. రాజకీయ వైరంలో ఎంత వరకైనా వెళ్తారని అంటారు. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్‌ కన్నుమూసిన అనంతరం ఆమె పార్టీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.

ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా నిలదొక్కుకోలేదు. అనంతరం పార్టీ జానకి, జయ వర్గాలుగా చీలిపోయింది. అనంతరం వచ్చిన 1989 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. దీంతో డీఎంకే అధికారాన్ని కైవసం చేసుకుంది. జానకి రామచంద్రన్‌ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆమె వర్గం తిరిగి జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకేలో విలీనమయింది.

1991లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంది. నాటి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి తమిళరాజకీయాలపై జయలలిత ముద్ర కొనసాగింది. 2001లో తిరిగి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2011లో, 2016లో మరోసారి గెలుపొందారు. 1991 నుంచి జయలలిత అంటే అన్నాడీఎంకేగా కొనసాగింది. పార్టీ అంటే ఆమె. మంత్రుల నుంచి సాధారణ కార్యకర్త వరకు ఆమె చెప్పినట్లు నడుచుకోవాల్సిందే.

జయలలిత అస్తమయం: తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది

జయలలిత సన్నిహితురాలు శశికళ. ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా సన్నిహితమైన వ్యక్తి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా స్నేహానికి మారుపేరుగా నిలిచారు. 2011 డిసెంబరులో శశికళ ఆమె భర్త నటరాజన్‌తో పాటు 11 మందిని పోయస్‌గార్డెన్‌ నుంచి బయటకు పంపించివేశారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత తనకు జయ ముఖ్యమని చెబుతూ శశికళ కుటుంబ సబ్యులకు దూరమై
చివరకు శశికళ... తనకు జయ స్నేహమే ముఖ్యమని కుటుంబసభ్యులతో బంధాలు తెగతెంపులు చేసుకున్నారు.

English summary
Late Tamil Nadu Chief Minister J Jayalalithaa passed away on December 5, 2016 at 11.30 PM aged 68. She became the third Chief Minister of Tamil Nadu to pass away while holding office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X