మేజర్‌ను కాల్చి చంపిన ఆర్మీ జవాన్, ఐదు బుల్లెట్లు దిగాయి
భారత ఆర్మీలో మేజర్ ర్యాంకులో పని చేస్తున్న వ్యక్తిని జవాను కాల్చి చంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న జవానును మేజర్ ప్రశ్నించారు.
శ్రీనగర్: భారత ఆర్మీలో మేజర్ ర్యాంకులో పని చేస్తున్న వ్యక్తిని జవాను కాల్చి చంపినట్లు రిపోర్టులు వచ్చాయి. విధి నిర్వహణలో సెల్‌ఫోన్‌ను వినియోగిస్తున్న జవానును మేజర్ ప్రశ్నించారు.
దీంతో కోపోద్రిక్తుడైన జవాను.. మేజర్ పైన కాల్పులు జరిపారని సమాచారం. దాదాపు ఐదు బుల్లెట్లు మేజర్ శిఖర్ థాప శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికి అక్కడే మృతి చెందారు.

ఇరువురిని ఆర్మీ యూరి ప్రాంతంలోని నియంత్రణ రేఖకు పికెటింగ్‌కు పంపినట్లు చెబుతున్నారు. మేజర్ శిఖర్ థాప 71 ఆర్మోర్డ్ రెజిమెంట్‌కు చెందిన వారు. అతనిని రాష్ట్రీయ రైఫిల్స్‌కు అటాచ్ చేశారు.












Click it and Unblock the Notifications