వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల బస్సులో మంటలు: నలుగురు మృతి, 20 మందికి గాయాలు

శ్రీనగర్: కత్రా నుంచి జమ్మూ వెళ్లే స్థానిక బస్సులో మంటలు చెలరేగడంతో నలుగురు యాత్రికులు మరణించగా, మరో 20 మంది గాయపడ్డారని జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. నివేదికల ప్రకారం.. శుక్రవారం బస్సు కత్రా నుంచి జమ్మూకి వెళ్తుండగా, కత్రా నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నోమై సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఇంజిన్ ప్రాంతం నుంచి మంటలు అంటుకున్నాయి. అది వెంటనే మొత్తం బస్సును చుట్టుముట్టింది అని జమ్మూ ఏడీజీపీ తెలిపారు. నలుగురు మరణించినట్లు తెలిపారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రత్యేక వైద్య చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

J&K: Bus Carrying Vaishno Devi Pilgrims Catches Fire In Katra, Four Dead, 20 Injured

జమ్మూ జోన్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ADG) ముఖేష్ సింగ్ మాట్లాడుతూ.. ప్రాథమిక దర్యాప్తులో ఎటువంటి పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు చూపలేదు. వైష్ణో దేవి పుణ్యక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల కోసం కత్రా బేస్ క్యాంప్ ఏర్పాట చేసినట్లు తెలిపారు.

"కత్రా వద్ద బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, రీసి డిప్యూటీ కమిషనర్ బాబిలా రఖ్వాల్‌తో మాట్లాడారు. ఇద్దరు చనిపోయారని నివేదించబడింది, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ఆర్థికంగా, ఇతరత్రా సాధ్యమైన అన్ని సహాయం అందించబడుతుంది ' అని మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.

కాగా, ఏప్రిల్‌లో జమ్మూకాశ్మీర్‌లోని రామ్‌నగర్‌లోని ఉద్దక్ ప్రాంతంలో బస్సు రోడ్డుపై నుంచి జారిపడి, ఇద్దరు ప్రయాణికులు మరణించారు. ఇరవై ఐదు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉధంపూర్ జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేసినట్లు సబ్-డివిజనల్ పోలీసు అధికారి రాంనగర్, భీష్మ్ దూబే తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+