వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కథువా రేప్ కేసు: జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం గుప్తా సంచలనం

By Narsimha
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: కథువా రేప్ ఘటనపై జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ సీఎం కవిందర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన చాలా చిన్నదన్నారు. దీనికి అంతగా ప్రాధాన్యత ఇవ్వరాదన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో ఆయన వివరణ ఇచ్చారు. కథువా వంటి కేసులు చాలా ఉన్నాయన్నారు. దీన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు.

కథువా కేసు సర్వోన్నత న్యాయస్ధానం పరిథిలో ఉన్నందున దీన్ని పదేపదే ప్రస్తావించడం సరైంది కాదన్నారు. కథువా కేసు విచారణను ఛండీగర్‌కు బదలాయించాలని, సీబీఐకి అప్పగించాలని పలు పిటిషన్లు దాఖలైన క్రమంలో మే 7వరకూ ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు నిలిపివేసింది.

J&K Deputy CM Kavinder Gupta sparks row with remark on Kathua gangrape case

ఈ ఏడాది జనవరి 10న కథువాకు సమీపంలోని గ్రామం నుంచి 8 ఏళ్ల మైనర్‌ బాలికను అపహరించిన దుండగులు లైంగిక దాడి జరిపి దారుణంగా హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.

కథువా రేప్ ఘటనకు సంబంధించి దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న మంత్రులు కూడ మంత్రివర్గం నుండి వైదోలగాల్సిన పరిస్థితి నెలకొంది.

English summary
Bharatiya Janata Party (BJP) leader Kavinder Gupta, who took oath as Deputy Chief Minister of Jammu and Kashmir on Monday, has triggered a row with his statement on Kathua gangrape and murder case. According to the Deputy CM, the incident in Kathua is a minor one and should not be given much importance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X