షాక్:పెళ్ళిళ్ళపై ఆంక్షలు, శుభలేఖలు, స్వీట్లు, పంచొద్దు, ఏప్రిల్ నుండి ఇలానే....
హంగు, ఆర్బాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరగాలని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కోరుతోంది. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ నుండి వివాహల నిర్వహణపై ఆంక్షలను విధిస్తోంది.
శ్రీనగర్:హంగు , ఆర్భాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరగాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కోరుతోంది.ఈ మేరకు వివాహలపై ఆంక్షలను విధిస్తోంది.కూతురు వివాహనికి 500మంది, కొడుకు పెళ్ళికి 400 మంది అతిథులను మాత్రమే నిబంధనలను విధించింది.
నిశ్చితార్థం నుండి వివాహమయ్యే వరకు ఆ ఇంట్లో సందడి ఉంటుంది. అయితే వివాహన్ని చాలా ఆర్బాటంగా జరుపుకొనేందుకు ఇష్టపడతారు.అయితే జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ఆర్భాటంగా వివాహలు చేసుకొనే వారికి చుక్కలు చూపిస్తోంది.

భారీ ఎత్తున విందు, వినోదాలు,హంగు ఆర్భాటాలకు వెళ్ళకుండా వివాహలు జరపాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ప్రజలను కోరుతోంది. వివాహలపై ఆంక్షలను విధిస్తోంది.
కూతురు వివాహనికి 500 మందిని, కొడుకు వివాహనికి 400 మందిని మాత్రమే పిలవాని ప్రభుత్వం నిబంధనలను విధించింది. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేట్ సామాజిక ఫంక్షన్లలో ఎక్కడైనా కూడ లౌడ్ స్పీకర్లను వాడకూదని , టపాకాయలు పేల్చకూడదని ఆదేశించింది.
శుభలేఖలతో పాటు, స్వీట్లు, డ్రై ప్రూట్లు పంపేందుకు కూడ వీల్లేదని ఆంక్షలను విధించింది.సామాజిక,ప్రభుత్వ, ప్రైవేట్ ఫంక్షన్లు ఎక్కడ జరిగినా అత్యవసర సరుకులను విచ్చలవిడిగా ఉపయోగించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆంక్షలను విధించింది.ఈ కొత్త నిబంధనలన్నీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ,, తేది నుండి అమల్లోకి రానున్నట్టు ఆ రాష్ట్ర వినియోగదారుల వ్యవహరాల శాఖ మంత్రి చౌదరి జుల్పికర్ అలీ చెప్పారు.
హంగు , ఆర్భాటాలకు దూరంగా వివాహ వేడుకలు జరగాలని జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కోరుతోంది.ఈ మేరకు వివాహలపై ఆంక్షలను విధిస్తోంది.కూతురు వివాహనికి 500మంది, కొడుకు పెళ్ళికి 400 మంది అతిథులను మాత్రమే నిబంధనలను విధించింది.












Click it and Unblock the Notifications