మోడీ విజిట్: పాక్‌ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్: పాకిస్థాన్‌ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఇద్దురు భారత జవాన్లు మృతిచెందారు. కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద గురెజ్‌ సెక్టార్‌లో సోమవారం మధ్యాహ్నం పాక్‌ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. మెషిన్‌గన్లు, రైఫిళ్లు, మోర్టార్లతో భారత స్థావరాలపై దాడి జరిపింది.

పాక్‌ దళాలకు దీటుగా కాల్పులు జరిపామని సైనికాధికారి వెల్లడించారు. మరో నాలుగు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ జమ్ముకాశ్మీర్‌ వస్తారనగా పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం గమనార్హం.

J-K: Two jawans killed as Pakistan violates ceasefire ahead of Modi’s visit

భారత్‌-రష్యా మధ్య భారీ రక్షణ ఒప్పందం

భారత్‌, రష్యా మధ్య సోమవారం భారీ రక్షణ ఒప్పందం కుదిరింది. రష్యా నుంచి రూ.70వేల కోట్ల విలువ చేసే ఎస్‌-400 బాలిస్టిక్‌ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను సేకరించడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

రష్యా పర్యటనలో ఉన్న భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, రష్యా రక్షణ మంత్రి సెర్గేయ్‌ షోయిగు సైనిక సాంకేతిక సహకార ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఎస్‌-400 క్షిపణులకు సంబంధించి ధర, సేకరించాల్సిన క్షిపణి వ్యవస్థల సంఖ్య సహా విధివిధానాలపై ఉభయుల మధ్య జరిగిన భేటీలో అంగీకారం కుదిరినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+