వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కేసు: శ్రీనివాసన్‌కు సమన్లా, అరెస్టు వారంటా?

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో బిసిసిఐ చీఫ్, ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ చిక్కుల్లో పడ్డారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో శ్రీనివాసన్ పేరు చేర్చింది. ఆ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత శ్రీనివాసన్‌పై చర్యలకు ఆదేశాలు జారీ చేయవచ్చునని చెబుతున్నారు.

శ్రీనివాసన్‌కు, ఇతర నిందితులకు సమన్లు జారీ చేయాలా, అరెస్టు వారంట్లు జారీ చేయాలా అనే విషయంపో కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. నాన్ బెయిల్ నేరాల కింద అభియోగాలు మోపడంతో నిందితులందరూ వ్యక్తిగతంగా కోర్టుకు హాజకు కావాల్సి ఉంటుందని అంటున్నారు. చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత సమన్లు జారీ చేయాలా, అరెస్టు వారంట్లు జారీ చేయాలా అనే విషయంపై కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.

N Srinivasan

నేరాలు తీవ్రమైనవి, అదుపులోకి తీసుకోవడం అవసరమని భావిస్తే వారంట్లు జారీ చేసి అరెస్టు చేసి, తమ ముందు హాజరు పరచాలని కోర్టు సిబిఐని ఆదేశిస్తుంది. వైయస్ జగన్ కేసులో క్రిమినల్ కుట్రకు, మోసానికి పాల్పడ్డాడని శ్రీనివాసన్‌పై సిబిఐ చార్జిషీట్‌లో అభియోగాలు మోపింది.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ తాజాగా మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇండియా సిమెంట్స్, రఘురాం (భారతి సిమెంట్స్), పెన్నా సిమెంట్స్‌పై సిబిఐ ఆ చార్జిషీట్లు దాఖలు చేసింది.

English summary
India Cements MD and BCCI chief N. Srinivasan will have to appear before the CBI court at Nampally after the court takes cognizance of the CBI’s chargesheet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X