Jagdeep Dhankar: రాజీనామా కు ముందే ధన్ కర్ షాకులు..! అవాక్కైన రాష్ట్రపతి భవన్ ?
కేంద్రంతో వివాదాల నేపథ్యంలో ఆరోగ్య కారణాలు చూపుతూ ఆకస్మికంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసేసిన జగ్ దీప్ ధన్ కర్.. తన నిర్ణయంతో దేశ ప్రజలకు, రాజకీయ పార్టీలకు, చివరికి సొంత పార్టీ బీజేపీకి కూడా షాకిచ్చారు. అదే సమయంలో రాజీనామాకు ముందే ఆయన ఏకంగా రాష్ట్రపతి భవన్ కే షాకిచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ రాష్ట్రపతి భవన్ కు ధన్ కర్ ఎలా షాకిచ్చారో చూద్దాం..
మొన్న రాత్రి 9.30 గంటల సమయంలో ఆరోగ్య కారణాలతో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నట్లు జగ్ దీప్ ధన్ కర్ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను జత చేశారు. ఇందులో తన పదవీకాలంలో అన్ని విధాలా సహకరించిన రాజకీయ పార్టీలు, నాయకులు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ లేఖ క్షణాల్లో దేశమంతా వైరల్ అయిపోయింది. దీంతో ధన్ కర్ రాజీనామాపై అధికార, విపక్షాల నాయకులు ఆరా తీయడం ప్రారంభించారు.

ఇలా ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేయకముందు జగ్ దీప్ ధన్ కర్ ఢిల్లీలోని తన నివాసం నుంచి రాష్ట్రపతి భవన్ కు బయలుదేరారు. కాసేపటికే అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నుంచి ఎలాంటి ముందస్తు అపాయింట్ మెంట్ కూడా ఆయన తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో ఇంత రాత్రి సమయంలో అదీ ఉప రాష్ట్రపతి స్వయంగా రావడంతో రాష్ట్రపతి భవన్ సిబ్బంది అవాక్కయ్యారు. చివరికి రాష్ట్రపతి ముర్ముకి వెంటనే సమాచారం తెలియజేసి ధన్ కర్ ను లోపలికి అనుమతించారు.

ధన్ కర్ అంత రాత్రి పూట రాష్ట్రపతి భవన్ కు రావడంతో అక్కడి సిబ్బంది వెంటనే ఆయన్ను రాష్ట్రపతి ముర్ముతో సమావేశమయ్యేందుకు హడావిడిగా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. చివరికి రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయిన ధన్ కర్ తన పదవికి ఆరోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత 9.25 సమయంలో ఎక్స్ లో తన రాజీనామా లేఖను ధన్ కర్ పోస్టు చేసారు. దీంతో ఈ వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications