Jaggery Benefits: బెల్లం తినడం మంచిదా.. కాదా..
వాతావరణ మార్పు మనపై ప్రభావం చూపుతుంది.దీని మనం అనారోగ్యానికి గురవుతాం. వాతావరణ మార్పు వల్ల దగ్గు, జలుబు, జ్వరం, మలబద్దకం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి బెల్లం ఉపయోగపడుతుందట. రోజూ ఒక బెల్లం ముక్కను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయట. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి మంచి చేస్తుందట.

రోగనిరోధక శక్తి
బెల్లం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లంలో ఉండే సైటో ప్రొటెక్టివ్ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. బెల్లం ఆహారం సులువుగా జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడుతుంది. బెల్లం జబులు, ప్లూ, జ్వరం వంటి అనారోగ్య సమస్యలను నుంచి ఉపశమనం కలిగిస్తుందట. మహిళలు, పిల్లల్లోనే రక్తహీనత సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. బెల్లం తినడం ద్వారా రక్తహీనత తగ్గుతుంది.

చక్కెర స్థాయి
చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అధికంగా బెల్లాన్ని వాడితే మాత్రం శరీర సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంటుందట. బెల్లం సహజ స్వీటెనర్‌గా ఉండటం వల్ల శరీరానికి ఉపయోగపడుతుంది. అయితే, అది స్వచ్ఛంగా లేకుండా కల్తీగా ఉండేమాత్రం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో బెల్లం తినడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయట

ఫ్రక్టోజ్, గ్లూకోజ్
బెల్లం శరీరానికి మంచిదే అయినప్పటికీ, దానిని ఎక్కువ మోతాదులో తింటే బరువు పెరిగే అవకాశం ఉందట. మధుమేహం ఉన్నవారు బెల్లం ఎక్కువగా తినకూడదు. బెల్లంలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్‌లతోపాటు కొవ్వులు, ప్రోటీన్లు కూడా ఉంటాయి కాబట్టి షుగర్ ఉన్నవారు చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి.












Click it and Unblock the Notifications