జైలు జీవితం నుంచి రిటైర్డ్ జస్టిస్ కర్ణన్‌కు విముక్తి.. నేడు విడుదల
సుప్రీంకోర్టునే ధిక్కరించిన కేసులో జైలుపాలైన కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్ బుధవారం ప్రెసిడెన్సీ జైలు నుంచి విడుదల కానున్నారు. కోర్టు ధిక్కార నేరం కింద ఆయనకు ఆరు నెలల జైలుశిక్ష పడింది.
కోల్‌కతా: సుప్రీంకోర్టునే ధిక్కరించిన కేసులో చివరికి జైలుపాలైన కోల్‌కతా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్ బుధవారం ప్రెసిడెన్సీ జైలు నుంచి విడుదల కానున్నారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడటం ద్వారా కర్ణన్ కొద్దికాలం క్రితం వరకూ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.
కోర్టు ధిక్కారం కేసులో అరెస్టుకు ముందు తాత్కాలిక బెయిల్ కోసం చేసుకున్న విజ్ఞప్తిని సైతం అత్యున్నత న్యాయస్థానం నిరాకరించడంతో ఆయన అరెస్టు అనివార్యమైంది. తమిళనాడులోని కోయంబత్తూరులో గత జూన్ 20న కోల్‌కతా పోలీసులు కర్ణన్‌ను అరెస్టు చేశారు.

కోర్టు ధిక్కార నేరం కింద ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. తన శిక్ష రద్దు చేయాల్సిందిగా ఆయన చేసిన విజ్ఞప్తిని కూడా కోర్టు గత మే 19న తిరస్కరించింది. అప్పటి నుంచి ఆయన ప్రెసిడెన్సీ జైలులో ఉంటున్నారు.
అత్యున్నత పదవిలో ఉన్న ఓ సిట్టింగ్ జడ్జికి జైలు శిక్షపడటం దేశ న్యాయ చరిత్రలో ఇదే ప్రథమం. తనను అరెస్టు చేయడం ఖాయం అని తెలియగానే కర్ణన్ కొన్ని రోజులపాటు అదృశ్యమైనా చివరికి లొంగిపోయారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications