సాధ్వీ జై శ్రీ ఎస్కేప్: పెరోల్ లో పై వచ్చి, చక్కగా మసాజ్, బాహుబలి 2 చూసి చెక్కేసిన లేడీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

అహమ్మదాబాద్: ఆమె చూడటానికి ఓ సన్నాసి, గుజరాత్ లోని బనస్కంత జిల్లాలో ఒక స్వచ్చంద సంస్థ, ఆశ్రమం నడుపుతోంది. పైగా ఆలయాన్ని నిర్వహిస్తోంది. ఆమె పేరు జై శ్రీ గిరి. 2017 జనవరిలో గుజరాత్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఆమె ఆశ్రయం మీద నిఘా వేశారు.

హీరోయిన్ కంటే అందంగా, వందల కోట్ల ఆస్తి, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం, చివరికి ఆమె !

అదే నెలలో పోలీసులు జై శ్రీ గిరి ఆశ్రయంపై దాడులు నిర్వహించారు. అంతే దేశం బిత్తరపోయే విషయాలు వెలుగు చూశాయి. పెద్ద మొత్తంలోనే ఆమె అక్రమ మార్గంలో బంగారం కొనుగోలు చేశారని అధికారులు గుర్తించారు. అంతే అడ్డంగా సాధ్వీ జై శ్రీ గిరి పోలీసులకు దొరికిపోయారు.

పేరుకు ఆశ్రయం లోపల ?

పేరుకు ఆశ్రయం లోపల ?

జై శ్రీ గిరి (45) అనే మహిళా సన్యాసిని నిర్వహిస్తున్న ఆశ్రయంలో బంగారు బిస్కెట్లతో పాటు పెద్ద ఎత్తున మద్యం సీసాలు బయటపడటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ. కోట్లరూపాయాల విలువైన అక్రమ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు జై శ్రీ గిరిని అరెస్టు చేశారు.

జైల్లో జై శ్రీ గిరి జపం !

జైల్లో జై శ్రీ గిరి జపం !

అహమ్మదాబాద్ జైల్లో జై శ్రీ గిరి విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల ఆమె ఆరోగ్య పరీక్షల నిమిత్తం పెరోల్ మీద బయటకు వచ్చారు. సన్యాసి జై శ్రీ గిరి సెక్యూరిటీ కోసం నలుగురు గార్డులను ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆమె బయటకు పంపించారు.

సమ్మగా మసాజ్ !

సమ్మగా మసాజ్ !

ఆరోగ్య పరీక్షల పేరిట జైలు నుంచి బయటకు వచ్చిన మహిళా సన్యాసి జై శ్రీ గిరి తనకు కొంత విరామం కావాలని కోర్టులో బ్రతిమిలాడుకోంది. గురువారం అహమ్మదాబాద్ లోని హిమాలయన్ మాల్ కు తన వ్యక్తి గత లాయర్, నలుగురు గార్డులతో కలిసి వెళ్లింది. అక్కడ సమ్మగా మసాజ్ చేయించుకుంది.

బాహుబలి 2 సినిమా

బాహుబలి 2 సినిమా

ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి 2 సినిమా గురించి తెలుసుకున్న జై శ్రీ గిరి ఆ సినిమా హాయిగా చూసింది. తరువాత నిరంతరం ఫోన్ లో మాట్లాడి తనకు పెరోల్ మరింత పొడిగించే అవకాశం ఉందా ? అంటూ వివరాలు సేకరించింది.

వాష్ రూంలో !

వాష్ రూంలో !

పెరోల్ గడవు పొడగించే అవకాశం లేదని తెలుసుకున్న జై శ్రీ గిరి గురువారం సాయంత్రం తాను వాష్ రూం (బాత్ రూం)కు వెళ్లి వస్తానని గార్డులకు చెప్పి వెళ్లింది. అటు నుంచి అటే చెక్కేసింది. విషయం తెలుసుకున్న నలుగురు గార్డులు బిత్తరపోయారు.

లాయర్ , గార్డులు !

లాయర్ , గార్డులు !

జై శ్రీ గిరి తప్పించుకున్నారని తెలుసుకున్న అధికారులు ఆమె వ్యక్తి గత లాయర్ ను, ఆమెకు భద్రతగా పంపించిన నలుగురు గార్డులను అరెస్టు చేశారు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరిన నలుగురు గార్డులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మాయలేడీ ఎక్కడ ?

మాయలేడీ ఎక్కడ ?

దాదాపు ఐదు కోట్ల రుపాయల విలువైన అక్రమ బంగారు బిస్కెట్లు, భారీగా మద్యం సీసాలు ఆశ్రమంలో దాచి పెట్టుకుని ప్రజలను మోసం చేసి ఇప్పుడు తప్పించుకున్న మహిళా సన్యాసి జై శ్రీ గిరి కోసం గుజరాత్ పోలీసులు గాలిస్తున్నారు. సాధ్వీ జై శ్రీ గిరిని పట్టుకోవడం ఇప్పుడు గుజరాత్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Out of jail on a brief parole for a medical check-up, a self-styled sadhvi gave the Ahmedabad police a slip on Thursday, but not before going to a spa for massage and watching Baahubali 2.
Please Wait while comments are loading...