వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అమెరికా వ్యాక్సిన్ సాయం వట్టిదేనా? ముఖేష్ బాంబు-బైడెన్ మంత్రులు బ్లింకెన్, అస్టిన్‌తో జైశంకర్ చర్చలు

|
Google Oneindia TeluguNews

అంతులేకుండా సాగుతోన్న కరోనా విలయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ దేశాలైన అమెరికా -భారత్‌లు కొవిడ్ పై పోరాటంలో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని నిర్ణయించాయి. శనివారం నాటికి గ్లోబల్ గా కొవిడ్ కేసులు 17కోట్లకు, కరోనా మరణాలు 35.4లక్షలకు చేరగా, కేసులు, మరణాల్లో అమెరికా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కరోనాక విరుగుడు వ్యాక్సిన్లు మాత్రమేననే భావన బలంగా ఉండగా, భారత్ లో వ్యాక్సిన్ల కొరత తీరేలా అమెరికా నుంచి సహాయం పొందేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న సంగత తెలిసిందే. మరోవైపు రెండు దేశాల వ్యాక్సిన్ మైత్రిపై వ్యూహాత్మక సంస్థల ప్రతినిధులు మాత్రం భిన్నంగా మాట్లాడటం కలకలం రేపుతున్నది.

Recommended Video

India - US Talks | Covid Vaccine చర్చ జరగలేదు.. ముఖేష్ | S Jaishankar || Oneindia Telugu

మోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనామోదీపై భారీ కుట్ర: అమెరికాలో మంత్రి Jaishankar గగ్గోలు -Vaccineమైత్రికి కసరత్తు -హిందూత్వ ఇమేజ్ పైనా

రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్రఘురామకు గాయాలపై సీఐడీ కీలక ప్రకటన -ఎంపీ కాళ్లకు పీఓపీ కట్లు -కణాలు దెబ్బతిన్నాయన్న ఎయిమ్స్

 బ్లింకిన్, అస్టిన్‌తో జైశంకర్

బ్లింకిన్, అస్టిన్‌తో జైశంకర్

ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శుక్రవారంనాడు వాషింగ్టన్ డీసీలో యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్(విదేశాంగ మంత్రి) ఆంటోని బ్లింకెన్, యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ(రక్షణ మంత్రి) లాయిడ్ అస్టిన్‌లతో భేటీ అయ్యారు. వేర్వేరుగా జరిగిన ఈ సమావేశాల్లో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబధాలతోపాటు ప్రాంతీయంగా నెలకొన్న సమస్యలు, కొవిడ్ రెండో వేవ్ లో భారత్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనాను నిలువరించే క్వాడ్ ప్రయత్నాలు, మయన్మార్ లో సైనిక తిరుగుబాటు వల్ల తలెత్తిన అశాంతి తదితర అంశాలపైనా ఇరు నేతలు మాట్లాడుకున్నారు. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి అత్యున్నత స్థాయి మంత్రి చేస్తున్న తొలి పర్యటన కావడంతో జైశంకర్ రాకను అమెరికా కీలకంగా భావిస్తున్నది.

భారత్ సాయం మర్చిపోలేం..

భారత్ సాయం మర్చిపోలేం..

ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్, అమెరికా విదేశాంగ మంత్రులు జైశంకర్, ఆంటోని బ్లింకెన్ లు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ''కొవిడ్ ఉత్పాతం మొదలైన తొలినాళ్లలో అమెరికాకు భారత్ ఎంతో సహాయం చేసింది. అండగా నిలబడింది. ఆ విషయాన్ని మేం ఎన్నటికీ మర్చిపోలేం. రెండో వేవ్ లో భారత్ కు అన్ని విధాలుగా అండగా ఉండాలని అమెరికా భావిస్తున్నది'' అని బ్లింకెన్ చెప్పారు. ''చర్చించుకోడానికి మా మధ్య చాలా విషయాలున్నాయి. దశాబ్దాలుగా రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా బలంగా కొనసాగుతున్నాయి. కష్టంలో ఉన్న భారత్ కు బలమైన మద్దతు, సంఘీభావం తెలిపినందుకు అమెరికాకు కృతజ్ఞతలు'' అని జైశంకర్ వ్యాఖ్యానించారు. కాగా,

చర్చల్లో వ్యాక్సిన్ల ప్రస్తావన లేదు..

చర్చల్లో వ్యాక్సిన్ల ప్రస్తావన లేదు..

వ్యాక్సిన్ల తయారీ, సామూహిక వ్యాక్సినేషన్ ప్రక్రయలో అందరికంటే ముందున్న అమెరికా నుంచి టీకాల సాయం పొందాలనేది జైశంకర్ పర్యటన అసలు ఉద్దేశమనే అభిప్రాయానికి భిన్నంగా యుఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ అధ్యక్షుడు డాక్టర్ ముఖేష్ అఘీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారంనాడు అమెరికాలోని టాప్ కార్పొరేట్ కంపెనీల అధినేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొన్నారు. భారత్ కు కొవిడ్ వ్యాక్సిన్ల అందజేతలో ఆయా కంపెనీలన్నీ సహకరిస్తాయని తొలుత ప్రకటనలు వెలువడ్డాయి. కానీ నిజానికి ఆ భేటీలో వ్యాక్సిన్ల గురించిన చర్చలు జరగలేదని ముఖేష్ బాంబు పేల్చారు. కేవలం కంపెనీల విస్తరణ, ఉద్యోగాల కల్పన, అవకాశాల సృష్టి లాంటి అంశాలపై మాత్రమే జైశంకర్ మాట్లాడారుతప్ప కొవిడ్ వ్యాక్సిన్లపై చర్చ జరగలేదని అఘీ పేర్కొన్నారు. జైశంకర్ అమెరికా మంత్రులతో జరిపిన చర్చల్లోనూ కొవిడ్ విషయంలో సాయం అనే మాట తప్ప వ్యాక్సిన్ల సాయంపై కచ్చితమైన హామీ ఏది లభించలేదు.

English summary
External Affairs Minister S Jaishankar met United States Secretary of State Antony Blinken and Secretary of Defence Lloyd Austin in Washington D.C. on Friday. Blinken said that two countries were united in tackling the Covid-19 pandemic together. Jaishankar thanked Blinken and Austin for the assistance provided by the United States to help respond to the second wave of the Covid-19 pandemic in India. The External Affairs Minister and the American Secretary of State noted that the India-US relations had grown stronger over the years. while, US-India Strategic Partnership Forum Chief Mukesh Aghi said there was no discussion on COVID-19 vaccine in the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X