జైట్లీ బడ్జెట్: తొమ్మిది విమానాశ్రయాల్లో ఈవీసాలు
న్యూఢిల్లీ: దేశంలో పర్యాటకాభివృద్ధికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలోని తొమ్మిది విమానాశ్రయాల్లో ఈ వీసాలను ఇచ్చే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన గురువారం తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.
దేశంలోనికి రావడానికి ఈ వీసాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన చెప్పారు. సౌకర్యాలను దశలవారీగా కల్పిస్తామని ఆయన చెప్పారు. వికలాంగుల కోసం జైట్లీ పథకాలను ప్రకటించారు. దేశంలో కొత్తగా 15 కొత్త బ్రెయిలీ ప్రెస్‌లను స్థాపిస్తామని ఆయన చెప్పారు.

పదిహేను కొత్త బ్రెయిలీ ప్రెస్‌లను ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న 10 ప్రెస్‌లను పునరుద్ధరిస్తామని చెప్పారు.
జాతీయ గ్రామీణ ఇంటర్నెట్, టెక్నాలజీ మిషన్‌ను 500 కోట్ల రూపాయలతో స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో నెట్‌వర్క్స్‌ను పిపిపి మోడ్‌లో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications