మోడీని పట్టుకుంటే రూ.100 కోట్లు, మీరు పట్టుకోలేరు: జమాత్ చీఫ్
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీని అరెస్టు చేసిన వారికి వంద కోట్ల రూపాయల నజరానా ఇస్తామని ఓ సంస్థ ప్రకటన చేసింది. పాకిస్థాన్‌కు చెందిన రాజకీయ పార్టీ జమాత్ ఈ ఇస్లామీ అధినేత సిరాజ్ ఉల్ హక్ ఈ ప్రకటనను చేశాడు.
సోమవారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని రావల్‌కోట్‌లో ఓ కార్యక్రమానికి సిరాజ్ హాజరయ్యాడు. ప్రధాని మోడీ పైన నిప్పులు చెరిగాడు. హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ను పట్టుకున్నవారికి బహుమతి ప్రకటించినా భారత అధికారులు అతణ్ని పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశాడు.

నీవు, నీ ఏజెంట్లు సలాహుద్దీన్‌ను అరెస్టు చేయలేరని నేను ప్రధాని మోడీకి చెప్పాలనుకుంటున్నానని, సలాహుద్దీన్‌ను అరెస్టు చేసినవారికి రూ.50 కోట్లు ఇస్తామని మీరు చెప్పారని, కానీ నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నానని చెప్పాడు.
ప్రధాని మోడీని అరెస్టు చేసిన వారికి రూ.100 కోట్లు ఇస్తామని సవాల్ చేశాడు. కాశ్మీర్ పాకిస్థాన్‌లో భాగమని ప్రకటించాడు.
భారత్‌తో స్నేహ సంబంధాలు కోరుకునే పాకిస్తాన్ రాజకీయ నేతలెవరైనా పాకిస్థాన్ ద్రోహులు, కాశ్మీరీ ద్రోహులేనని పేర్కొన్నాడు. హిందుస్థాన్‌తో స్నేహం కోరుకునేవారు హిందుస్థాన్‌కు ఢిల్లీకో, ముంబైకో వెళ్లిపోవచ్చని, వారికి ఇస్లామాబాద్‌లో చోటు లేదన్నాడు.












Click it and Unblock the Notifications