ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పెన్‌ డ్రైవ్స్‌, వాట్సప్‌ పై నిషేధం..

డేటా సెక్యూరిటీలో భాగంగా జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెన్ డ్రైవ్ ల వినియోగాన్ని నిషేధించింది. అలాగే వాట్సాప్ సేవలపైనా నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలో సైబర్ సెక్యూరిటీలో కొన్ని తప్పిదాల నేపథ్యంలో తదుపరి సైబర్ దాడులను నిరోధించేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ పరిధిలోని కమిషనర్ సెక్రటరీ ఎం. రాజు ఆదేశాలు జారీ చేశారు.

జమ్ము కాశ్మీర్ లో సైబర్ నేరాలను అడ్డుకోవడంతోపాటు ప్రభుత్వ కార్యాలయాల్లోని సున్నితమైన ప్రభుత్వ సమాచారాన్ని కాపాడటం, మాల్ వేర్ సమస్యలతోపాటు ఇతరులు సైబర్ నేరాలకు పాల్పడకుండా నిరోధించడం.. తదితర చర్యల్లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ సమాచారం నేరగాళ్ల చేతిలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌ మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే.. ఆఫీస్ అవసరాల కోసం పెన్ డ్రైవ్‌ లను ఉపయోగించడానికి అనుమతి ఉంటుంది. దీనికి సంబంధిత ఇంచార్జ్ నుంచి NICలోని స్టేట్ ఇన్ఫర్మాటిక్స్ ఆఫీసర్ కు అధికారికంగా అభ్యర్థన పంపాలి. అనుమతి లభించిన తర్వాత, పెన్ డ్రైవ్‌ ను NIC సెల్‌ కు సమర్పించిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.

Jammu and Kashmir Government Bans Pen Drives WhatsApp in Offices for Data Security

మరోవైపు జమ్మూ కాశ్మీర్‌ లోని పూంచ్ జిల్లాలో LoC వెంబడి రెండు డ్రోన్‌ లను భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఈ డ్రోన్ లు పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించాయి. వెంటనే కాల్పులు జరిపాయి భద్రతా దళాలు. అయితే, కాల్పులు ప్రారంభం కాగానే ఆ డ్రోన్‌ లు తిరిగి పాకిస్థాన్ వైపు వెళ్లిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఇక పాకిస్థాన్.. ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి, సరిహద్దుల్లో ఆయుధాలు, మాదక ద్రవ్యాలను సరఫరా చేయడానికి ఈ డ్రోన్‌ లను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+