ఉగ్రవాదుల దాడి: జవాను మృతి, ముగ్గురికి గాయాలు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఆర్మీ క్యాంపుపై కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఓ జవాను మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం ఉదయం కథువా జిల్లాలో చోటుచేసుకుంది.
ఉగ్రవాదిలో గాయాలపాలైన క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అక్కడే ఓ బొలోరో వాహనంలో ఉన్న వారిపై కూడా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దాడి అనంతరం ఆ బొలెరో వాహానాన్ని తీసుకుని జమ్మూ వైపు పరారయ్యారు. ఉగ్రవాదుల దాడితో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు, భద్రతాదళాలు అప్రమత్తమయ్యారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు.

జంగ్లోట్ ప్రాంతంలో సైనిక స్థావరం సమీపంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి భద్రతా దళాలు చేరుకున్నాయి. అక్కడే ఉన్న ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పులో ఓ సైనికుడు గాయపడ్డారు. ఇంకా ఉగ్రవాదులు, సైనికుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
భద్రతా దళాలు గట్టి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ ఉగ్రవాదులు ఈ విధమైన దాడులకు పాల్పడుతూ ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారు. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు సృష్టించేందుకే ఉగ్రవాదులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications