షాకింగ్ ఒపీనియన్ పోల్- పశ్చిమ బెంగాల్ లో గెలిచేది ఆ పార్టీనే: ఆశలు అడియాశలే
ఇది- ఎన్నికల నామ సంవత్సరం. ఈ ఏడాది మొత్తం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతోన్నాయి. ఇందులో మూడు మన దక్షిణాదికి చెందినవే. ఒక్క రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతం తప్పితే మిగిలినచోట్ల నాన్ బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అదే స్థాయిలో ఆయా చోట్ల అధికారంలో ఉన్న పార్టీలు హోరాహోరీ సమరానికి సై అంటోన్నాయి.
దక్షిణాదిన తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, పశ్చిమాన ఉన్న బెంగాల్, ఈశన్యా రాష్ట్రం అస్సాం.. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్నాయి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంటోంది. పుదుచ్చేరిలో ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక మిగిలిన చోట్ల బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. వీటిల్లో మెజారిటీ రాష్ట్రాలను దక్కించుకోవడానికి బీజేపీ వ్యూహాలను రచిస్తోంది. అన్నింటికీ మించి వారి చూపు అంతా పశ్చిమ బెంగాల్, తమిళనాడుపైనే ఉంది.

ఈ పరిణామాల మధ్య ఇప్పుడిప్పుడే ఎన్నికల అంచనాలు, ఒపీనియన్ పోల్స్ వెలువడటం మొదలైంది. తాజాగా పశ్చిమ బెంగాల్ పై జన్ మత్ పోల్స్ సంస్థ తన అభిప్రాయాలను వెల్లడించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, వాటికి పడే ఓటింగ్ శాతం ఎంత అనేది వివరించింది. పశ్చిమబెంగాల్ నార్త్, సౌత్ గా విభజించి.. రీజియన్ వారీగా ఆయా పార్టీలకు వచ్చే సీట్లు, పడే ఓట్ల శాతాన్ని అంచనా వేసింది. దీన్ని విడుదల చేసింది.
జన్ మత్ అంచనాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అది కూడా భారీ మెజారిటీతో. ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఒంటిచేత్తో అధికారాన్ని నిలబెట్టుకుంటుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మమత. ఇక నాలుగోసారి కూడా టీఎంసీ అధికారంలోకి వస్తుందని తెలిపింది.
पश्चिम बंगाल विधान सभा चुनाव
— Janmat polls (@Janmatpolls) January 18, 2026
ओपिनियन पोल 👇 pic.twitter.com/6uZJRI9fcK
294 సీట్లు ఉండే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో తృణమూల్ కాంగ్రెస్ 150 నుంచి 180 వరకు నియోజకవర్గాల్లో జెండా ఎగురవేస్తుంది. 2021 తో పోల్చుకుంటే ఇప్పుడు మమత బెనర్జీ.. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడకతప్పదు.
బీజేపీ.. మరోసారి ప్రతిపక్ష స్థానంలోనే కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది. 80 నుంచి 110 స్థానాల్లో విజయం సాధిస్తుంది. వామపక్షాలు, కాంగ్రెస్, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఏ మాత్రం కూడా పోటీ ఇచ్చే అవకాశాలు లేవు.. జన్ మత్ ఒపీనియన్ పోల్స్ బట్టి చూస్తే. ఈ మూడు పార్టీలు కూడా 15 నుంచి 25 సీట్లకే పరిమితమౌతాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications