జపాన్ లో మహమ్మారి విజృంభణ.. నెక్ట్స్ భారత్..?
కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్ల నుంచి కాస్త ఉపశమనం కలిగించిన మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. జపాన్ లో ఇన్ ఫ్లూయెంజా మహమ్మారి క్రమంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఊహించిన సమయం కంటే నెల రోజుల ముందే వైరస్ తీవ్ర స్థాయికి చేరింది. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, మార్కెట్లు మూసివేశారు. వైరస్ బాధితులతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రజలకు వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రయత్నాలను జపాన్ హెల్త్ మినిస్ట్రీ వేగవంతం చేసింది.
వాతావరణ మార్పులు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం కారణంగా రానున్న నెలల్లో ప్రపంచ దేశాల్లో ఫ్లూ సీజన్ ప్రారంభం కానుంది. జపాన్ లో దేశవ్యాప్తంగా ఫ్లూ కేసులు పెరిగిపోయాయి. జపాన్ లోని స్థానిక మీడియా రిపోర్ట్స్ ప్రకారం అక్టోబర్ 3 నాటికే 3 వేల మందికిపైగా ఫ్లూ బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సాధారణంగా జపాన్ లో నవంబర్ చివరివారం డిసెంబర్ లో ఫ్లూ సీజన్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ సారి ఐదు వారాల ముందే ఫ్లూ విజృంభణ కొనసాగుతోంది.
ఫ్లూ కారణంగా జపాన్ లోని టోక్యో, ఒకినావా, కగోషిమా ప్రాంతాల్లోని 135 పాఠశాలలు, చైల్డ్ కేర్ సెంటర్లను మూసివేశారు. రానున్న రోజుల్లో ఫ్లూ వ్యాప్తి అధికంగా ఉంటుందని హొక్కైడో హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోకో సుకమోటో అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ఫ్లూ వైరస్ తన లక్షణాన్ని మార్చుకుంటుందని తెలిపారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం చేయాలన్నారు.

జపాన్ లో ఫ్లూ వైరస్ అడ్వాన్స్ డ్ పద్ధతితో దూసుకెళ్తోంది. నార్త్, ఈస్ట్రర్న్ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ వైరస్ లక్షణాలు అధికమైన దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అధిక ఉష్ణోగ్రతగా ఉన్నాయి. జపాన్ లో ప్రస్తుతం శీతాకాలం కావడంతో ఫ్లూ కేసులు అధికం అవుతున్నాయి. అయితే ఈ వైరస్ కారణంగా భారత్ కు వచ్చే ముప్పు తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. భారత్ లోని ట్రాఫికల్ క్లైమేట్ కారణంగా ఫ్లూ ముప్పు ఉండదని వివరిస్తున్నారు.












Click it and Unblock the Notifications