ఫ్లాష్ బాక్: ఒకే ఒక్కడు.. 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంపైకి చైనా సైన్యం దూసుకొచ్చింది. ఆ ప్రాంతంలో రక్షణ బాధ్యతలను భారత సైన్యానికి చెందిన గఢ్వాల్‌ రైఫిల్స్‌ విభాగం నిర్వహిస్తోంది. మిడుతల దండులాగా వస్తున్న చైనీయులను న

అది 1962.. నవంబరు నెల.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతంపైకి చైనా సైన్యం దూసుకొచ్చింది. ఆ ప్రాంతంలో రక్షణ బాధ్యతలను భారత సైన్యానికి చెందిన గఢ్వాల్‌ రైఫిల్స్‌ విభాగం నిర్వహిస్తోంది. మిడతల దండులాగా వస్తున్న చైనీయులను నిలువరించడం భారత సైనికులకు కష్టతరంగా మారుతోంది.

భారత సైనికులు వీరోచితంగా పోరాడుతున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో వెనక్కు మళ్లాలని ఆదేశాలు అందాయి. కానీ రైఫిల్‌మాన్‌ జశ్వంత్‌సింగ్‌ రావత్ మాత్రం తన స్థానం నుంచి కదల్లేదు. చైనీయులపై తుపాకి గుళ్ల వర్షం కురిపించాడు. దాదాపు మూడు రోజుల పాటు వారిని నిలువరించి 150 మంది చైనా సైనికులను మట్టుబెట్టాడు.

ఇద్దరు బాలికల సాయంతో..

ఇద్దరు బాలికల సాయంతో..

ఈ పోరాటంలో రైఫిల్‌మాన్‌ జశ్వంత్‌సింగ్‌ కు స్థానికంగా ఉన్న ఇద్దరు మొన్పా బాలికలు సెల, నురా సాయపడ్డారు. చైనీయులకు కనిపించే విధంగా దాదాపు 300 రైఫిళ్లను ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీంతో చైనా సైన్యాలకు అక్కడ వందలాది భారత సైనికులు పోరుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. దీంతో వారు ముందుకొచ్చే ధైర్యం చేయలేదు.

బయట పడిన నిజం...

బయట పడిన నిజం...

ఇలా వరుసగా మూడు రోజులు గడిచాయి. చైనీయులకు దిక్కుతోచలేదు. ఇదే సమయంలో జశ్వంత్‌సింగ్‌కు ఆహారాన్ని తీసుకొస్తున్న ఒక గ్రామస్థుడిని వారు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని చిత్రహింసలు పెట్టడంతో అతడు నిజం చెప్పేశాడు. విషయం తెలుసుకున్న చైనీయులు అవాక్కయ్యారు. ఆ వెంటనే జశ్వంత్‌ శిబిరంపై విరుచుకుపడ్డారు.

తూటాలు లేక.. బలిదానం

తూటాలు లేక.. బలిదానం

ఆ సమయంలోనూ అధైర్యపడని జశ్వంత్‌ చివరి నిమిషం వరకు పోరాటం సాగించాడు. తూటాలు ఖాళీ అవడంతో శుత్రు సైనికులకు ప్రాణాలతో దొరికిపోవడం ఇష్టం లేక.. చివరి తూటాతో తాను ఆత్మాహుతి చేసుకున్నాడు. అనంతరం అతడికి సాయపడిన ఆ ఇద్దరు బాలికలను కూడా చైనా సైన్యం చంపేసింది.

కోపం చల్లారక...

కోపం చల్లారక...

తమను మూడు రోజులుగా ముప్పుతిప్పలు పెట్టిన జశ్వంత్‌సింగ్‌పై శత్రువులకు ఆగ్రహం తగ్గలేదు. ఆయన తలను తమతో పాటు తీసుకెళ్లారు. కొన్ని రోజుల తరువాత ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో జశ్వంత్‌సింగ్‌ తలను తిరిగి అప్పగించారు. ఆయన అసమాన ధైర్యసాహసాలను చైనీయులు కూడా ప్రశంసించడం గమనార్హం. ఆయన సాహసానికి గుర్తుగా భారత ప్రభుత్వం ‘మహావీర చక్ర' అవార్డు ప్రకటించింది.

ఇప్పటికీ.. ‘బాబా జశ్వంత్‌’గా...

ఇప్పటికీ.. ‘బాబా జశ్వంత్‌’గా...

తవాంగ్‌ ప్రాంతం వారు ఇప్పటికీ జశ్వంత్‌సింగ్‌ను బాబా జశ్వంత్‌గా ఆరాధిస్తారు. ఆయన బలిదానం చేసిన ప్రాంతంలో ఒక మందిరాన్ని నిర్మించారు. ఈ ప్రాంతం మీదుగా తమ విధులకు వెళ్లే భారతీయ సైనికులు ఆ మందిరంలో పూజలు చేస్తారు. స్థానికులు ఆయన జీవించి ఉన్నట్టే భావించి ఇప్పటికీ ఆయన బూట్లను శుభ్రం చేస్తుంటారు. ఆయన మందిరం వద్ద భారత సైనికులకు తేనీరు, ఉపాహారాన్ని సరఫరా చేయడం విశేషం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+