మెట్రో రైలులో ఆఫీసుకు వచ్చిన ప్రకాష్ జవదేకర్

న్యూఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శుక్రవారంనాడు మెట్రో రైలులో ప్రయాణించారు. గుర్గావ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ మెట్రో రైలు తన కార్యాలయానికి తిరికి వచ్చారు. గురు ద్రోణాచార్య స్టేషన్‌లో రైలును పట్టుకున్న జవదేకర్ తన పర్యావరణ కార్యాలయానికి సమీపంలో ఉన్న జోర్ బాగ్ స్టేషన్‌లో దిగిపోయారు.

నిజానికి, జవదేకర్ తరుచుగా ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తారు. ఇందిరా గాందీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ఎక్కడానికి ఆయన ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లోనే వెళ్తారు.

Javadekar travels by Delhi Metro to reach office

కొద్ది రోజుల క్రితం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కూడా ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. ఒకసారి మాత్రమే కాకుండా కొన్ని సార్లు ఆయన మెట్రో రైలులో ప్రయాణించారు. ఆధునిక భారతదేశానికి సంకేతంగా చెబుతూ పర్యావరణ అనుకూలతను ప్రచారం చేయడానికి ఆయన మెట్రో రైలులో ప్రయాణం చేశారు.

యుపిఎ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన కాంగ్రెసు నాయకుడు ఎం వీరప్ప మొయిలీ కూడా కొన్ని మార్లు మెట్రో రైలులో ప్రయాణం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+