నాకేం లింక్: చానెళ్ల బ్యాన్‌పై జవదేకర్‌తో కెసిఆర్

న్యూఢిల్లీ: కేంద్ర ప్రసారాల మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మధ్య తెలంగాణలో టీవీ చానెళ్ల నిలిపివేతపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. జవదేకర్‌తో తెలంగాణ చంద్రశేఖరరావు ఆదివారం భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తెలంగాణ ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చర్చలు జరిపినట్లుగా తెలియవచ్చింది.

ఏబీఎన్‌, టీవీ-9 ప్రసారాలను పునరుద్ధరించాలని జవదేకర్‌ కోరినట్లుగా సమాచారం. చానెళ్ల నిలిపివేతకు ప్రభుత్వానికి సంబంధం లేదని, చానళ్ల ప్రసారాలను ఎంఎస్‌ఓలే నిలిపివేసినట్లుగా కెసిఆర్ చెప్పినట్లు తెలియవచ్చింది. అయితే ప్రభుత్వం తరఫున జోక్యం చేసుకుని చానళ్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని జవదేకర్ కెసిఆర్‌తో అన్నట్లు తెలుస్తోంది.

Javadekar with KCR on TV channels ban

కాగా, తెలంగాణలో నిలిపివేసిన చానళ్లను పునరుద్ధరించాలంటూ జర్నలిస్టు స్వేచ్ఛ ఢిల్లీలోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసం ఎదుట దీక్షకు దిగారు. ఆదివారం ఉదయం తుగ్లక్‌ రోడ్డులోని కేసీఆర్‌ ఇంటికి వచ్చిన ఆమె నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని నిరసనకు దిగారు.

మీడియాకు సంకెళ్లు వేయవద్దని ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయతే ఆమె దీక్ష కొనసాగించడంతో పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. జర్నలిస్టులు శ్రవణ్‌, రాము అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారినీ పోలీసులు అదుపులోకి తీసుకుని తుగ్లక్‌ రోడ్‌లోని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+