ఆమెకు 21.28 కిలోల బంగారు ఆభరణాలు, ఆ వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేస్తాం

జయ ఉపయోగించిన వస్తువులతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నారు అన్నాడిఎంకె నేతలు.

చెన్నై :జయలలిత ఉపయోగించిన వస్తువులు ఎవరికీ దక్కుతాయి. వీటిని ఏం చేస్తారు. కోర్టు ఆధీనంలో ఉన్న ఈ వస్తువులను కోర్టు ఎవరికీ అప్పగిస్తోంది. ప్రస్తుతం అందరికీన ఇదే ప్రశ్న వేధిస్తోంది. కోర్టు తీర్పు తర్వాత జయ ఉపయోగించిన వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేయాలనే యోచనలో అన్నాడిఎంకె పార్టీ నాయకులు ఉన్నారు.ఈ వస్తువులు దక్కుతాయో తేలడానికి వచ్చే ఏడాది జూన్ వరకు వేచి చూడాల్సిందే.

 ఆమె వాడిన వస్తువులు కోర్టు ఆధీనంలో

ఆమె వాడిన వస్తువులు కోర్టు ఆధీనంలో

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసును డిఎంకె అధికారంలో ఉన్న కాలంలో జయలలిత ఎదుర్కొన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ ఈ కేసు ఆమెను వెంటాడింది. ఈ కేసు కారణంగా ఆమె ఉపయోగించిన వస్తువులన్నీ కోర్టు పరిధిలోకి వెళ్ళాయి.1996 లో ఆదాయపు పన్నుశాఖాధికారులు జయ నుండి ఆమె ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు. 1996 లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకొన్న ఈ వస్తువులను కర్ణాటక పోలీసుల సంరక్షణలో ఉంచారు.

 750 చెప్పుల జతలు

750 చెప్పుల జతలు

సినిమా నటిగా అత్యధిక పారితోషికం తీసుకొన్నారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా భాద్యతలను నిర్వహించారు. ఆమెకు 750 చెప్పుల జతలున్నాయి. ఈ చెప్పుల జతలను జాగ్రత్త చేసేందుకు పనివాళ్ళు ఇబ్బంది పడేవారట. ఆమె వద్ద 10,500 చీరెలు ఉన్నాయి. ఐదువందల వైన్ గ్లాసులను స్వాధీనం చేసుకొన్నారు. వీటన్నింటిని ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆమె నుండి స్వాధీనం చేసుకొన్నారు. 2002 లో ఆదాయపు పన్నుశాఖాధికారులు ఈ వస్తువులను కర్ణాటక పోలీసులకు అప్పగించారు.

 21 కిలోల బంగారు ఆభరణాలు

21 కిలోల బంగారు ఆభరణాలు

జయలలిత నుండి 21.28 కేజీల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొన్నారు 1250 కిలోల వెండి వస్తువులను , రెండు కోట్ల విలువైన వజ్రాలు, వెండి కత్తి వంటివి ఆదాయపన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొని భద్రపర్చారు. అయితే ఈ కేసు కు సంబందించి 2017 జూన్ లో సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించనుంది అయితే ఆ తీర్పు వచ్చే వరకు ఈ వస్తువులు ఎవరికీ దక్కుతాయనేది ఉత్కంఠగా మారింది.

 మ్యూజియం ఏర్పాటు

మ్యూజియం ఏర్పాటు

2017 జూన్ లో ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అంశంపై జయలలిత పై ఉన్నకేసుపై తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అయితే ఈ కేసును ఎదుర్కొన్నజయలలిత అనారోగ్య కారణాలతో మరణించారు.దీంతో ఈ కేసు లో శశికళ, ఇలవరసి, సుధాకరన్ కూడ నిందితులుగా ఉన్నారు. కేసు విచారణ పూర్తైంది,. తీర్పు మాత్రం పెండింగ్ లో ఉంది. కోర్టు తీర్పు ఏం చెబుతోంది. ఈ ఆస్తులను తిరిగి ఇస్తోందా. ఇస్తే ఈ ఆస్తులను ఎవరికి చెందుతాయనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ ఆస్తులన్నీ ఎవరికీ దక్కుతాయో స్పష్టత రావాల్సి ఉంది. మరో వైపు కోర్టు తీర్పు తర్వాత అన్నీ అనుమతులు వస్తే జయ ఉపయోగించిన వస్తువులతో ఒక మ్యూజియాన్ని ఏర్పాటుచేయాలనే ఆలోచనలో అన్నా డిఎంకె పార్టీ నాయకులు ఉన్నారు. అయితే కోర్టు తీర్పును బట్టి మ్యూజియం ఏర్పాటు చేయడం ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+