Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జయా బచ్చన్ ‘డ్రగ్స్’పై రాజకీయం చేస్తున్నారు: రవికిషన్‌కు మద్దతంటూ జయప్రద ఫైర్

న్యూఢిల్లీ/ముంబై: బాలీవుడ్ నటుల డ్రగ్స్ వ్యవహారంపై ఎంపీ జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రద. భారతీయ జనతా పార్టీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తానని ఆమె స్పష్టం చేశారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ కోణంపై మంగళవారం పార్లమెంటులో చర్చ జరిగిన విషయం తెలిసిందే.

రవికిషన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జయాబచ్చన్..

రవికిషన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన జయాబచ్చన్..

ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ, ప్రముఖ సినీనటుడు రవికిషన్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని పలువురు మాదక ద్రవ్యాలకు బానిసలు అవుతున్నారని అన్నారు. అంతేగాక, ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రవికిషన్. అయితే, ఆయన వ్యాఖ్యాలను జయాబచ్చన్ ఖండించారు. కొందరు వ్యక్తుల కారణంగా మొత్తం పరిశ్రమను కించపర్చవద్దని, నటుడైన ఓ ఎంపీ పరిశ్రమకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని జయాబచ్చన్ అన్నారు. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ నటీనటులు జయాబచ్చన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. కంగనా రనౌత్ సహా మరికొందరు నటులు ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించారు.

జయాబచ్చన్ రాజకీయం చేస్తోందంటూ జయప్రద..


ఈ నేపథ్యంలో జయప్రద.. జయాబచ్చన్ వ్యాఖ్యాలపై స్పందించారు. ‘డ్రగ్స్‌కు బానిసలైన నటులను, యువతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న రవికిషన్‌కు నేను పూర్తి మద్దతు తెలుపుతున్నా. మనమంతా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాడాలి. మన యువతను కాపాడాలి. ఈ అంశంపై జయాబచ్చన్ రాజకీయాలు చేస్తున్నారు' అని జయప్రద మండిపడ్డారు.

డ్రగ్స్‌పై పోరాటానికి జయాబచ్చన్ మద్దతివ్వాలి..

డ్రగ్స్‌పై పోరాటానికి జయాబచ్చన్ మద్దతివ్వాలి..

అంతేగాక, బచ్చన్ కుటుంబాన్ని అమర్ సింగ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారని, అంతేగాక, వారికి ఎంతో చేశారని జయప్రద అన్నారు. కానీ, అనారోగ్యంతో అమర్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అమితాబ్, జయాబచ్చన్ ఎక్కడున్నారని ఆమె ప్రశ్నించారు. బాలీవుడ్ తొలి కుటుంబం ఉన్న వీరు ఒక ప్రధాన సమస్య పరిష్కారానికి ఎందుకు మద్దతివ్వడం లేదని నిలదీశారు. డ్రగ్స్ వ్యవహారంలో రియా చక్రవర్తి కీలక పేర్లను వెల్లడిస్తున్న సమయంలో..
జయాబచ్చన్ దీన్ని వ్యక్తిగతంగా ఎందుకు తీసుకుంటున్నారు? అని ప్రశ్నించారు. యువత డ్రగ్స్‌కు బానిసలు కాకుండా చేస్తున్న పోరాటానికి ఆమె మద్దతుగా నిలవాలని జయప్రద వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+