జయ టీవీ ఎండీ, జాజ్ సినిమాస్ సీఇవో, ఐటీ దాడి, శశికళ బినామి, ఈ వయసులో ఎన్ని ఆస్తులు !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: శశికళ కుటుంబ సభ్యుల మీద ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి. ఇప్పుడు శశికళ సోదరుడు జయరామన్ కుమారుడు, జాజ్ సినిమాస్ సీఇవో, జయ టీవీ ఎండీ వివేక్ పీకల్లోతుల్లో చిక్కుకుపోయాడని సమాచారం. జాజ్ సినిమాస్ శశికళ బినామి కంపెనీ అంటూ కొన్ని ఆదారాలు ఐటీ శాఖ అధికారులకు చిక్కాయని తెలిసింది.

  IT raids on Jaya TV just After 3 days of Modi-Karunanidhi meet

  మోడీ ఎఫెక్ట్: శశికళ ఆర్థిక సామ్రాజ్యానికి ఐటీ శాఖ షాక్, బెంగళూరు నుంచి దినకరన్ పరుగో పరుగు !

  ఇప్పటికే వివేక్ మీద అనేక కేసులు ఉన్నాయి. వివేక్ మీద స్మగ్లింగ్ కేసు నమోదు అయ్యింది. గురువారం వేకువ జామున నుంచి వివేక్ ఇళ్లు, కార్యాలయం, జాజ్ సినిమాస్ కార్యాలయాలు, జయ టీవీ కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు.

  Jaya TV MD Vivek's family will face many cases including Smuggling.

  ఇంత చిన్న వయసులో వివేక్ రూ. వందల కోట్ల విలువైన ఆస్తులు ఎలా సంపాధించాడు అంటూ ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. వివేక్ తండ్రి జయరామన్ హైదరాబాద్ లోని జయలలిత ద్రాక్ష తోటలు చూసుకునే వారు.

  శశికళ లిక్కర్ కంపెనీ మిడాస్ లో ఐటీ అధికారులు, దివాకరన్ విచారణ, 187 చోట్లు సోదాలు !

  జయలలిత ద్రాక్ష తోటలు చూసుకుంటూ జయరామన్ మరణించాడు. జయరామన్ కు గతంలో వ్యాపారాలు లేవు. వివేక్ తల్లి ఇళవరసి శశికళతో పాటు బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. జాజ్ సినిమాస్ సంస్థతో వివేక్ అనేక సినిమాలు తమిళనాడులో పంపిణి చేశాడు.

  ఆదాయపన్ను చెల్లించకుండా వివేక్ అడ్డదారిలో జాజ్ సినిమాస్ సంస్థలను నిర్వహిస్తున్నాడని గతంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వివేక్, టీటీవీ దినకరన్ మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు ఎక్కువ దృష్టి పెట్టారని తెలిసింది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  According to the Sources Jaya TV MD Vivek's family will face many cases including Smuggling.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి