వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ టి ఆర్ చెప్పిన పద్యమే ఆమెకు స్పూర్తి ,ఈ స్పూర్తే డిఎంకె ను గద్దెదించేలా చేసింది

ఎన్ టిఆర్ చెప్పిన పద్యం స్పూర్తిగా డిఎంకెపై ఆమె పోరాటం చేసి విజయం సాధించారు.ఈ పద్యం స్పూర్తిగా ఆమె పథకం ప్రకారం పోరాటం చేసి డిఎంకె ను ఓడించింది. అసెంబ్లీలో ఆమెకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకొనే

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :డిఎంకె శాసనసభ్యుల చేతిలో అసెంబ్లీలో అవమాననానికి గురైన జయలలిత , ఆ పార్టీని గద్దెదించి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఎన్ టిఆర్ చెప్పిన పద్యం స్పూర్తిగా నిలిచింది. ఈ పద్యం స్పూర్తిగానే ఆమె డిఎంకె పై పోరాటాన్ని చేసింది.ఈ పధ్యంలోని పరమార్థాన్ని గ్రహించి, తనకు అనుకూలంగా ప్రణాళికను సిద్దం చేసుకొని విజయం సాధించింది జయలలిత.

రాజకీయ జీవితంలో ఆమె అనేక ఒడిదొడుకులను చవిచూశారు .ఎంజిఆర్ మరణంతో రాజకీయంగా ఆమె కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. పార్టీలో పట్టుకోసం ఆమె ప్రయత్నించారు. పై చేయి సాధించారు. 1989లో అసెంబ్లీలో ఆమె ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించారు.

1989 మార్చి చివరి వారంలో తమిళనాడు అసెంబ్లీలో డిఎంకె ఎంఏల్ఏలు ఆమెపై దాడి చేశారు. ఆమె చీర లాగే ప్రయత్నం చేశారు.ఈ ఘటనతో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానని ఆమె ప్రతినబూనారు. అయితే డిఎంకె ను ఓడించేందుకు మాత్రం సినీ నటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్ టిఆర్ వినిపించిన పద్యం ఆమె టానిక్ లా పనిచేసింది.

jayalalita inspiration a poem from mahabaratam

ఎన్ టి ఆర్ తో సినిమాలు చేసే సమయంలో తెలుగు గురించి సాహిత్యం గురించి జయతో ఎన్ టి ఆర్ చర్చించేవారు. భీముడి పాత్ర తనకు ఎందుకు ఇష్టమో ఎన్ టి ఆర్ చెప్పారు జయలలితకు. ఈ సందర్భంగా ద్రౌపది వస్త్రాపరణం సందర్భంగా కౌైరవుల ఎడల భీముడు చేసిన ప్రతినకు సంబంధించిన పద్యాన్ని ఆయన పాడి విన్పించారు. కురువృద్దులు గురువృద్ద బాంధవులనేకుల్ చూచుచుండ ..ద్రౌపదినిట్లు చేసినట్లు ఖులున్ అనే పద్యాన్ని ఆయన విన్పించారు.

ఈ పద్యం స్పూర్తిగా తీసుకొని ఆమె పథకం ప్రకారం పనిచేశారు. డిఎంకె ను ఎన్నికల్లో మట్టికరిపించారు. అసెంబ్లీలో డిఎంకె శాసనసభ్యుల చేతిలో అవమానికి గురైన ఆమె ఈ పద్యంలో భీముడి కి వచ్చిన ఆవేశాన్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. తనకు కూడ అదే ఆవేశం ఉందని, అయితే ఆవేశాన్ని నియంత్రించుకొని ఆమె పథకం ప్రకారం వ్యవహరించి విజయం సాధించింది.

English summary
jayalalita inspiration a poem in mahabaratam , cine actor ntr tell this poems meaning, and why he like bheemudu charectar explain ntr, when jaya inslut in assembly at 1989 . she recollect ntr's poem . this poems inspirateinon she struggle on dmk
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X