• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితంలో రహాస్యానికి అధిక ప్రాధాన్యత

By Narsimha
|

చెన్నై :దేశ రాజకీయ చరిత్రలో కీలక నాయకురాలిగా ఎదిగిన పురచ్ఛితలైవి ...తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం తొలి నుండి అన్ని రహాస్యంగానే ఉంచారు. దక్షిణాది రాజకీయాల్లో ఆమె చెరగని ముద్ర వేశారు. తమిళనాడు రాజకీయాలను ఆమె శాసించారు.. తన పాలనతో ఆమె తమిళనాట రాజకీయాల్లో పేదల హృదయాల్లో సుస్థిరస్థానం పొందారు.ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయించిన ఆమె గురించి బాహ్య ప్రపంచానికి తెలిసింది తక్కువే.

దక్షిణాది రాష్ట్రంలో ఒక పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పార్టీని ఒంటి చేత్తో నడిపారు. తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చాలా విషయాల్లో ఆమె రహస్యాన్నే పాటింాచరు. జయలలితను ప్రేమించేవారితో పాటు, ద్వేషించే వారి సంఖ్య కూడ తక్కువేమీ లేదు. తాను అనుకొన్నది సాధించేవరకు ఆమె నిద్రపోయేవారు కాదు. 16 ఏళ్ళ వయస్సులోనే ఆమె స్ఠార్ హీరోయిన్ స్థాయికి దిగారు . ఏదో రకంగా ఎప్పుడూ వార్తల్లో నిలిచేవారు జయలలిత.తాను ఏం చేసినా ఆమె రహస్యంగానే ఉంచేవారు.ఎన్నికల్లో మ్యానిఫెస్టో ప్రకటించేవరకు కూడ గోప్యతను పాటించేవారు.

కష్టపడకుండానే పేరు ప్రఖ్యాతలు

కష్టపడకుండానే పేరు ప్రఖ్యాతలు

తాను పెద్దగా కష్టపడకుండానే పేరు ప్రఖ్యాతలు వచ్చాయని జయలలిత చెప్పేవారు.సిరిసంపదలు కూడ తనకు అదే రకంగా వచ్చాయని ఆమె తరచూ చెబుతుండేవారని ఆమె సన్నిహితులు చెబుతుంటారు.ఆమె జీవితంలో అనేక విషాదఘటనలు చోటుచేసుకొన్నాయి. అయితే సంతోషాలు మాత్రమే బయటకు కన్పించేవి కొన్ని మాత్రమే. ఎక్కువశాతం ఆమె జీవితం అంతా రహస్యాలు ఎక్కువగా ఉన్నాయి.తమిళనాడు తో పాటు దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసినా , మహరాణిలా జీవించినా ఒంటరి జీవితాన్ని ఆమె గడిపారు.ఎవరో ఒకరి మీద తప్పనిసరిగా ఆధారపడాల్సిన అవసరం ఉంటుందని ఆమె చెప్పేవారని చెప్పారని సన్నిహితులు గుర్తుచేస్తున్నారు.ఆమె ఎప్పుడూ ఏం చేసేవారో కూడ బయటి ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడేవారు. హైద్రాబాద్ కు వచ్చినా, ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఆమె ఇదే పద్దతులను పాటించేవారు.

తమిళనాడు లో నిలదొక్కుక్కున్న మహిళా నేత

తమిళనాడు లో నిలదొక్కుక్కున్న మహిళా నేత

తమిళనాడు రాజకీయాల్లో పురుషాధిక్యత స్పష్టంగా కన్పిస్తోంది.అయితే అలాంటి రాష్ట్రంలో ఆమె పార్టీకి నాయకత్వం వహించి పాలన పగ్గాలు చేపట్టడడం సాధారణ విషయం కాదు. ఆమె అసంతృప్తితో ఉండేవారని చెబుతుంటారు సన్నిహితులు.అన్నాడిఎంకే వ్యవస్థాపకుడు ఎంజి రామచంద్రన్ ఆమెకు మద్దతుగా నిలిచినా, పార్టీలో సీనియర్లు మాత్రం ఆమెను వ్యతిరేకించారు. ఎంజిఆర్ మద్దతు కారణంగా ఆమె పార్టీలో ఉన్నప్పటికీ, ఆయన మరణం తర్వాత ఆమె చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.అయినా ఆమె తన బాధలను దిగమింగుకొని రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు.తమిళనాట రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలకు తమిళనాటు రాజకీయాలకు పేరుంది.1991 లో జయలలిత సిఎం గా విజయం సాధించారు. ఆ తర్వాత ఐదేళ్ళకు ఆమె ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి నుండి గుణపాఠాలు నేర్చుకొని వెనుదిరగకుండా తమిళనాట రాజకీయాలను శాసించారు.

అన్నీ రహాస్యాలు

అన్నీ రహాస్యాలు

ఈ ఏడాది సెప్టెంబర్ 22వ, తేదిన జయలలిత తీవ్రమైన జ్వరం, డీ హైడ్రేషన్ తో చెన్నై ఆపోలో ఆసుపత్రిలో చేరిన తొలి రోజు నుండి ఆమె చనిపోయేవరకు కూడ అన్ని విషయాల్లో రహస్యంగానే ఉంచారు.అమె ఆరోగ్య పరిస్థితిపై ఆపోలో ఆసుపత్రి యాజమాన్యానికి, కొద్దిమంది వైద్యులకు మాత్రమే విషయాలు తెలిసేవి. ఈ విషయాలను బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఎంత మంది విఐపి, వివిఐపిలు వచ్చినా జయలలితను కలిసే అవకాశం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్న ఫోటోలు, వీడియోలు కూడ ఇంతవరకు బయటకు రాలేదు.ఆమెకు కోలుకొంటున్నారని, గతంలో కంటే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి ,కాని, అసలు విషయాలను మాత్రం బయటపెట్టలేదు.ఆసుపత్రిలో ఆమె వెంట ఆమె సన్నిహితురాలు శశికళ ఒక్కరే ఉన్నారు.

 పోరాటమే జీవితం

పోరాటమే జీవితం

పెద్ద కష్టపడకుండానే తనకు సిరిసంపదలు , పేరు ప్రఖ్యాతలు వచ్చాయని జయలలిత పైకి చెప్పినా, జీవితాంతం ఆమె పోరాటం చేశారు. అయితే ఆమె జీవితంలో చోటుచేసుకొన్న ఘటనలు బయట ప్రపంచానికి తెలిసినవి చాల తక్కువ, తనకు సంబంధించిన విషయాలను ఎక్కువగా ఆమె బయటకు రాకుండా జాగ్రత్త పడేవారు. హైద్రాబాద్ లోని పామ్ హౌజ్ లో ఉండే తమిళనాడు కుటుంబసభ్యులు కూడ ఎక్కువగా బయటకు వచ్చేవారు కాదు..ఆమె హైద్రాబాద్ కు వచ్చి ఈ ఫామ్ హౌజ్ లో గడిపిన సమయంలో కూడ ఆమె గురించిన సమాచారం బయటకు పొక్కదు.స్కూల్ బోర్డు పరీక్షల్లో టాపర్ గా నిలిచిన జయలలిత లాయర్ కావాలని కోరుకొన్నారు. కాని, తల్లి బలవంతంతో పాటు, కుటుంబ పరిస్థితుల కారణంగా ఆమె సినిమాల్లోకి ప్రవేశించాల్సిన పరిస్థితులు వచ్చాయి.హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ ఉన్న సమయంలో కూడ ఆమె వాణిజ్య ప్రకటనల్లో నటించలేదు. ఆస్తుల కేసును ఎదుర్కొన్నారు. శశికళకు, ఆమెకు మధ్య సంబంధాలు మద్యలో చెడిపోయాయి, తర్వాత పరిస్థితుల్లో శశికళ తిరిగి ఆమె చెంతకు చేరారు. అసెంబ్లీలో తనకు జరిగిన పరాభవానికి ఆమె తగిన ప్రతీకారం తీర్చుకొనేందుకు కష్టపడ్డారు. అయితే 75 రోజులుగా ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేసింది. రాజకీయాల్లో ఉన్నంత కాలం ప్రత్యర్థులపై పోరాడింది. తాను అనుకొన్న లక్ష్యాన్ని సాధించేవరకు విశ్రమించలేదు. అయితే ఆమె జీవితం గురించి బయటకు తెలిసింది కొంత మాత్రమే.

English summary
jayalalita create history in tamilnadu politics.jayalalita stugguling from the student life. unexpectedly she has came to politics more information secrete, she is did not like known every thing others. when she joined in hospital till death everything secrets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X