ముందే: లోకసభ ఎన్నికలకు జయలలిత అభ్యర్థులు
చెన్నై: వచ్చే లోకసభ ఎన్నికలకు అన్నాడియంకె ప్రధాన కార్యదర్శి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. తమిళనాడులోని 39 స్థానాలకు, పుదుచ్చేరి నియోజకవర్గానికి ఆమె సోమవారం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. మార్చి 3వ తేదీ కాంచీపురం నుంచి తన ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు 15 జిల్లాల్లో పర్యటిస్తానని జయలలిత చెప్పారు.
మిత్రపక్షాలు పోటీ చేసే స్థానాల్లో అన్నాడియంకె తన పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుంది. పొత్తు కోసం వామపక్షాలు సిపిఐ, సిపిఎంతో చర్చలు జరుగుతున్నాయని, పొత్తు కుదిరిన తర్వాత ఆ పార్టీలకు కేటాయించే స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకుంటారని జయలలిత చెప్పారు.

అభ్యర్థులు: పి. వేణుగోపాల్ (తిరువల్లూరు), టిజి వెంకటేష్ బాబు (చెన్నై నార్త్), జెయవర్ధన్ (చెన్నై సౌత్), ఎస్ఆర్ విజయకుమార్ (సెంట్రల్ చెన్నై), కెఎన్ రామచంద్రన్ (శ్రీపెరంబుదూరు), మరగథం కుమారవేలే (కాంచీపురం), తిరుత్తని కె హరి (అరక్కోణం), బి. సేన్‌గుట్టవన్ (వెల్లూరు), కె. అశోక్ కుమార్ (కృష్ణగిరి), పిఎస్ మోహన్ (ధర్మపురి), ఆర్ వనరోజా (తిరువణ్ణామలై), గిండీ సేవల్ వి ఎలుమాలయ్ (అరణి), ఎస్. రాజేంద్రన్ (విల్లుపురం)
కె. కామరాజు (కల్లకురిచి), వి పన్నీరుసెల్వం (సేలం), పిఆర్ సుందరం (నమక్కల్), ఎస్ సెల్వకుమార చిన్నయన్ (ఏరోడ్), వి. సత్యభామ (తిరుపూరు), సి. గోపాలకృష్ణన్ (నీలగిరీస్), ఎపి నాగరాజన్ (కోయంబత్తూరు), సి. మహేంద్రన్ (పొల్లాచి), ఎం. ఉదయ్ కుమార్ (దిండిగుల్), ఎం తంబిదురై (దిండిగుల్), బి. కుమార్ (త్రిచి), ఆర్ఆర్ మురదైరాజ్ (పెరంబలూరు), ఎ అరుణ్ మొతేవన్ (కడలూరు), ఎం చండిరాకాసి (చిదంబరం), ఆర్‌కె భారతిమోహన్ (మైలదుతురాయ్), కె. గోపాల్ (నాగపట్నం)
కె. పరుశురామన్ (తంజవూరు), పిఆర్ సెంథిల్‌నాథన్ (శివగంగ), ఆర్ గోపాలకృష్ణన్ (మదురై), ఆర్ పార్థిబన్ (థేని), డి. రాధాకృష్ణన్ (వృద్ధునగర్), ఎ అన్వర్రాజ (రామనాథపురం), జె జెయసింగ్ త్యాగరాజ్ నట్టర్జీ (టుటికోరిన్), వసంతి మురగేషన్ (తెంకాశి), కెఆర్‌పి ప్రభాకరన్ (తిరునేల్వేలి), డి జాన్ తంగమ్ (కన్యాకుమారి), ఎంవి ఓమలింగం (పుదుచ్చేరి)












Click it and Unblock the Notifications