శశికళ దెబ్బ: జయలలిత మృతి, ‘సీబీఐ, డీఓపీటీ’విచారణ

న్యూఢిల్లీ: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందిన తీరు అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది.

జయలలిత అనుమానాస్పదంగా మృతి చెందారని, సీబీఐ విచారణ జరిపించాలని శశికళ పుష్ప కేంద్ర హోం శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. రాజ్యసభ సభ్యురాలు రాసిన లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Jayalalithaa death: Union home ministry forwards Rajya Sabha member Sasikala Pushpa’s letter seeking CBI probe to DOPT

సీబీఐకి సంబంధించిన వ్యవహారాలు చూసే డిపార్ట్ మెంట్ ఆఫ్ పెర్సనెల్ అండ్ ట్రైనింగ్ ( సిబ్బంది వ్యవహారాల శాఖ)కు జయలలిత అనుమానాస్ప మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని వచ్చిన లేఖను అప్పగించారు.

దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ మణిరాం ఒక మెమొరాండం విడుదల చేశారు. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో అనే విషయం రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పకు తెలియజేయాల్సిందిగా కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+